రిషబ్ పంత్కి రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం

టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ రూర్కీ దగ్గర పంత్ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్కి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు రిషబ్‌ను వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో ప్రాణాలు దక్కించుకునేందుకు పంత్ కారులో నుంచి దూకేసినట్లు తెలుస్తోంది. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగిన సమయంలో పంత్ కారులో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూర్కీ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

బంగ్లాదేశ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ ఆడిన విషయం తెలిసిందే. జనవరిలో జరగబోయే శ్రీలంకతో సిరీస్‌కు పంత్‌ను సెలక్షన్ టీమ్ ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి రిషబ్ పంత్ దుబాయ్‌లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.