ఆరోగ్య సంరక్షణకు రైస్ బ్రాన్ ఆయిల్ ఎంతగానో దోహదపడుతుంది ఫ్రీడం హెల్తీకుకింగ్ ఆయిల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్ రెడ్డి

హైదరాబాద్, బంజారాహిల్స్

ఫ్రీడం రైస్ బ్రాన్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ తో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఫ్రీడం హెల్తీకుకింగ్ ఆయిల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా కార్యాయలంలో ఫ్రీడం రైస్ బ్రాన్ ఆయిల్ ఐదు లీటర్ల క్యాన్ లను ఆయన మార్కెట్ లోకి విడుదల చేశారు . రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఆయన వివరించారు. రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం ద్వారా కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు.

గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో రైస్ బ్రాన్ వంట నూనెలు ముందున్నాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది .శరీరంలోని కొలెస్ట్రాల్‌ సమతుల్యతను సాధించడంలో రైస్ బ్రాన్ ఆయిల్ దోహదపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ,అమెరికా హార్ట్ అసోసియేషన్‌ గుర్తించాయని పి.చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు .ఫ్రీడం రైస్ బ్రాన్ అయిల్ దేశీయంగా తయారు చేశామని ఈ అయిల్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాడకం తక్కువగా ఉందన్నారు . రైస్ బ్రాన్ అయిల్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు .

బియ్యపు గింజ చుట్టూ ఉండే బ్రౌన్ కలర్ పొట్టులో అనేక పోషక గుణాలు ఉన్నాయని ..ఈ ఔషధగుణాలు కలిగిన ఫ్రీడం రైస్ బ్రాన్ ఆయిల్ ని ఐదు లీటర్ల క్యాన్ ల ద్వారా మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *