ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత
తెలుగు సినిమా నిర్మాత కాట్రగడ్డ మురారి కొద్దిసేపటి క్రితం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు.
78ఏళ్ళ వయసు కలిగిన మురారి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో భోజనం చేశారు. ఆ తరువాత గుండెలో నొప్పి ఉందని చెప్పడంతో ఆయను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు . అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. నారి నారి, త్రిశూలం, గోరింటాకు , జానకి రాముడు, ఊరు మొగలరాజపురం సినిమాలు నిర్మించారు.