హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జింగ్ మోడ్ స్టూడియో ను ప్రారంభించిన సినీనటి రెజీనా
హైదరాబాద్, జూబ్లిహిల్స్
భాగ్యనగరంలో సినీ నటి రెజీనా సందడి చేసింది.హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్ 36 లో నూతనంగా ఏర్పాటు చేసిన జింగ్ మోడ్ స్టూడియో ఆమె ప్రారంభించారు. అనంతరం జింగ్ మోడ్ స్టూడియో వ్యవస్థాపక సభ్యురాలు త్రిపుర రాణి మాట్లాడుతూ జీవనశైలి రూపకల్పన స్టూడియోలో తల నుండి కాలి వరకు 375కు పైగా సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మనిషి తనకు తాను కొత్త వ్యక్తిగా మార్చుకునేందుకు అనువైన ప్రదేశంగా మా స్టూడియో తీర్చిదిద్దామని తెలిపారు .ప్రకాశవంతమైన చర్మం, అందమైన చిరునవ్వు, అనువుగా ఉండే శరీరాకృతి, ఆరోగ్యకరమైన జీవితం, మేకప్, బ్యూటీ, ఉల్లాసవంతమైన మనస్సు, అందంగా చూపించే అలంకరణ, మనిషి అన్ని రకాలుగా పరివర్తన చెందేలా అనువైన ప్రదేశం ఈ జింగ్ మోడ్ స్టూడియో ఉంటుందన్నారు .