పారిజాత హోమ్స్ అండ్ డెవ‌ల‌ప‌ర్స్ వెంచ‌ర్లను ప్రారంభించిన రాంగోపాల్ వ‌ర్మ‌, హాకీ లెజెండ్ ముఖేష్‌కుమార్‌

హైద‌రాబాద్

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తేనే ఆ సంస్థ మనుగడ సాధిస్తుందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు .హైదరాబాద్ శామీర్ పేట్ లో20 ఎకరాల విస్తీర్ణంలో 12 టవర్లతో కూడిన పారిజాత ప్రైమ్ అనే వెంచర్ బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు. భ‌వ‌న నిర్మాణ రంగంలో రెండు ద‌శాబ్ధాల‌కు పైగా అనుభ‌వం ఉన్న పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ ఈ కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్ప‌టికే 15కు పైగా వెంచ‌ర్లు విజ‌య‌వంతంగా పూర్తిచేసిన ఈ సంస్థ వినియోగ‌దారుల‌కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంద‌న్నారు.

సాఫ్ట్‌వేర్ సంస్థ‌ల‌కు స‌రికొత్త నెల‌వుగా మారిన ఆదిభ‌ట్లలో ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ ప‌క్క‌న‌, వండ‌ర్‌లాకు అత్యంత సమీపంలో, ఔట‌ర్ రింగురోడ్డు ఎదురుగా పారిజాత ప్రైమ్ అనే వెంచ‌ర్ ప్రారంభించామని సంస్థ ఛైర్మన్ తాటిపాముల అంజయ్య అన్నారు. ఈ వెంచర్ లో 900 ఫ్లాట్లు ఉన్నాయని…. ఇప్ప‌టికే ప‌ని ప్రారంభం కావ‌డంతో పాటు దీనికి హెచ్ఎండీఏ అనుమ‌తి కూడా ల‌భించిందన్నారు.  మ‌రో రెండేళ్ల‌లో ఇక్క‌డ ఫ్లాట్లు అందుబాటులోకి వ‌స్తాయని అంజయ్య తెలిపారు. ఇక రెండో వెంచ‌ర్ బాచారం ప్రాంతంలో ప్రారంభించామని … ఇందులో ఒక వాణిజ్య భ‌వ‌నంతో పాటు 390 ఫ్లాట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ వెంచర్  ఔట‌ర్ రింగురోడ్డు  తారామ‌తిపేట ఎగ్జిట్‌కు అత్యంత స‌మీపంలో ఉంటుందన్నారు.ఈ కొత్త ప్రాజెక్ట్ సైతం రెండేళ్ల‌లో అందుబాటులోకి వ‌స్తుందన్నారు.  

శామీర్‌పేట‌లోని లియోనియా ప‌క్క‌న 20 ఎక‌రాల సువిశాల విస్తీర్ణంలో 12 ట‌వ‌ర్ల‌తో కూడిన పారిజాత ఐకాన్ ప‌నులు కొనసాగుతున్నాయని సంస్థ ఎండీ నరేష్ కుమార్ తెలిపారు .ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 1500 ఫ్లాట్లు, రెండు క్ల‌బ్‌హౌస్‌లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో మూడేళ్ళలో ఈ ప్రాజెక్ట్ అందబాటులోకి వస్తుందన్నారు. తాము చేపడుతున్న  ఈ మూడు ప్రాజెక్ట్ లకు  హెచ్ఎండీఏ  అనుమ‌తులు లభించాయమన్నారు. పారిజాత ఐకాన్ టవర్న్ లో  1100 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో 2 బీహెచ్‌కే ఫ్లాట్లు, 1650 చ‌ద‌ర‌పు అడుగుల‌తో 3 బీహెచ్‌కే ఫ్లాట్లు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు .

సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఎస్ఎఫ్‌టీ ధ‌ర‌ను కేవ‌లం రూ.3,500గా మాత్ర‌మే నిర్ణ‌యించిన‌ట్లు పారిజాత హోమ్స్ అండ్ డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ ఛైర్మ‌న్ తాటిపాముల అంజ‌య్య తెలిపారు. అంకిత‌భావంతో ప‌నిచేస్తూ, స‌రైన స‌మ‌యానికి   ఫ్లాట్ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తామని  ఆయ‌న చెప్పారు. 2002లో ప్రారంభ‌మైన పారిజాత సంస్థ కేవ‌లం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లోనే కాకుండా , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ‌, భీమ‌వ‌రం ప్రాంతాల్లోనూ కొన్ని వెంచ‌ర్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు  15 వెంచ‌ర్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిందన్నారు .  హిరణ్య ఈవెంట్ ప్లానర్స్  రక్షారెడ్డి  ఆధ్వర్యంలో బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  ద‌ర్శ‌కుడు  రాంగోపాల్ వ‌ర్మ , ఒలింపిక్స్ క్రీడాకారుడు ప‌ద్మ‌శ్రీ ముఖేష్ కుమార్‌, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి  డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్, టీఆర్ఎస్ నాయకుడు   మన్నె గోవర్ధన్రెడ్డి ,పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ  చైర్మన్  తాటిపాముల అంజయ్య, మేనేజింగ్ డైరెక్టర్  నరేష్ కుమార్, కంపెనీ డైరెక్టర్  శ్రీధర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *