ఏరియల్ సీడింగ్ ద్వారా మొక్కలు నాటే హర బర కార్యక్రమానికి తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం సంతోషంగా ఉంది దగ్గుపాటి రానా
హైదరాబాద్ ,బంజారాహిల్స్
అటవీ సంరక్షణ, మొక్కలు నాటే హర బర కార్యక్రమానికి తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ఎంతో సంతోషంగా ఉందని హీరో దగ్గుపాటి రానా అన్నారు .
టెక్నాలజీని ఉపయోగించి మొక్కలు పెంచేందుకు కృషి చేస్తున్న హర బరా సంస్థ సేవలు అభినందనీయమని సినీనటుడు దగ్గుపాటి రాణా అన్నారు .హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద హర బారా పేరుతో అడవుల పెంపకానికి ,అటవీ సంరక్షణకు ఏరియల్ సీడింగ్‌పై ప్రచారం నిర్వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు గ్లోబల్ వార్మింగ్ పెరిగి పోతుందని …దీనికి తోడు అటవీ ప్రాంతాలు కనుమరగవుతున్నాయని రానా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వృక్ష సంపద ను పెంచుకునేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనకేషన్స్,అటవీశాఖ ఆధ్వర్యం లో దేశం లోనే మొదటి సరిగా ఏరియల్ సీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హీరో దగ్గుపాటి రానా,అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు .
హర బహారా పేరుతో భారతదేశంలో 2030 నాటికి డ్రోన్స్ ద్వారా 1 బిలియన్ చెట్లను నాటడం లక్ష్యం ముందుకు సాగుతుందని హర బహార ప్రతినిధులు తెలిపారు .అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు అటవీ సంరక్షణను వేగవంతం చేసేందుకు ఏరియల్ సీడింగ్ ద్వారా విత్తనాలు చల్లి అడవిలో మొక్కులు పెంపొందిస్తామని తెలిపారు . టెక్నాలజీ ద్వారా వేగంగా అటవీ సంపదను పెంచడం ఈ హర బర ప్రధాన లక్ష్యమన్నారు.
ఈ సీడ్ కాప్టెటర్ ద్వారా వచ్చే వర్షాకాలానికి తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లోని అడవులలో 12,000 హెక్టార్ల భూమిలో 50 లక్షల చెట్లను నాటడం టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు