బతుకమ్మ ఆటాపాటలతో సందడి చేసిన రాహుల్ గాంధీ
బతుకమ్మ విశిష్టతను వివరించిన సీఎల్పీ నేత భట్టి
భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న బతుకమ్మ ప్రదర్శన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతుంది . భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన బతుకమ్మ ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తిగా తిలకించారు.
ఆ తర్వాత మహిళలతో కలిసి లయబద్ధంగా అడుగులు కలుపుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడి అందరిని అబ్బురపరిచారు. రాహుల్ జీతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్, ఎఐసిసి కార్యదర్శి బోసురాజు, మాజీ ఎంపీ మల్లు రవిలు బతుకమ్మ ఆట ఆడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయమైన బతుకమ్మను దసరా పండుగ ముందు తొమ్మిది రోజులపాటు తెలంగాణలో ఉన్న మూడు కోట్ల మంది ఈ పండుగలో మమేకమవుతారని.. తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకుంటారని భట్టి విక్రమార్క బతుకమ్మ విశిష్టత గురించి రాహుల్ జీకి వివరించారు.