భారత్ జోడో యాత్రలో విద్యార్థులతో కలిసి పరుగు పోటీల్లో పాల్గొన్న రాహుల్, రేవంత్

మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లాలో భారత్‌ జోడోయాత్ర కొనసాగుతోంది. ఉదయం పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాదయాత్ర మధ్యలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ,రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి కొద్దిసేపు పరుగుపందెంలో పాల్గొన్నారు.

ఈ పరుగుపందెంలో రాహుల్​ మిగతావారికంటే ఒక అడుగు ముందుకేశారు. కొద్దిసేపు కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. పాదయాత్రలో భారీగా అభిమానులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో రాహుల్ వెంట మనిక్కమ్ ఠాకూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, జానారెడ్డి, మధుయాస్కీ, మల్లురవి, వంశీచంద్​రెడ్డి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *