డిజిటల్ షాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కామర్స్ సంస్థ రేస్‌విన్ మార్ట్

రిటైలర్లకు ,ఈ కామర్స్‌ల మధ్య గ్యాప్‌ భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్‌ ఎంతగానో దోహదపడుతుంది -ఏసీపీ శి భాస్కర్
హైదరాబాద్‌లో ప్రారంభమైన డిజిటల్ షాప్ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం – రేస్‌విన్ మార్ట్ సీఈఓ వెంకట్
ఘర్షకోటి.
మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇన్వెంటరీ సప్లై చైన్ ప్రోడక్ట్ డామేజ్ వీటి మీద వెచ్చించే ఖర్చు పూర్తిగా పూర్తిగా తగ్గిపోతుంది.
Dr నదీముద్దీన్ ( ఫార్మర్ హాకీ ఇంటర్నేషనల్ ప్లేయర్)

హైదరాబాద్, జనవరి 24

హైదరాబాదీ స్టార్టప్ సంస్థ రేస్‌ విన్ మార్ట్ ….రిటైల్ షాపులు,ఈ కామర్స్‌ల మధ్య గ్యాప్‌ను భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ అమీర్‌పేట్ జిజ్జాస స్టూడియోలో డిజిటల్ షాప్ యాప్‌ను సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డిజిటల్ షాప్ ద్వారా స్థానిక వ్యాపారులు మరియు ఉత్సాహవంతులైన యువతీ యువకులు. రేస్‌ విన్ మార్ట్ లోని అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ ని వారి కస్టమర్స్ కి నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు .మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఎంతో మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న ఈ ఫ్లాట్ ఫాం మరింత పురోభివృద్ది సాధించాలన్నారు .హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ ప్రయాణం దేశ వ్యాప్తంగా విసర్తించాలని ఆశాభావం వ్యక్తం చేశారు .

ఫిజికల్‌మార్ట్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని…రేస్‌విన్ మార్ట్‌లో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండానే వ్యాపారం చేసుకునే అవకాశం ఉందని రేస్‌విన్ సీఈఓ, ఫౌండర్‌ వెంకట్ ఘర్షకోటి తెలిపారు. స్థానిక వ్యాపారులకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు . మా యాప్ ద్వారా ప్రస్తుతం రెండు వేలకుపై ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని… 150కిపైగా వ్యాపార సంస్థలు తమ సంస్థ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నాయని తెలిపారు .

ఈ కామర్స్ సంస్థలు, బ్రాండ్ స్టోర్లు వచ్చిన తర్వాత రిటైలర్స్‌కు అవకాశాలు తగ్గిపోయాయని…దీన్ని భర్తీ చేసేందుకు రేస్ విన్ మార్ట్ సంస్థ డిజిటల్ షాప్ విధానాన్ని మొదటి సారిగా ప్రవేశపెట్టామని వెంకట్ తెలిపారు . దేశవ్యాప్తంగా ఈ డిజిటల్ షాప్స్ ఓపెన్ చేసినటువంటి రిటైలర్స్ కి ఫిజికల్ షాపులో ఎలాంటి మార్జిన్స్ లభిస్తాయో ఈ డిజిటల్ షాప్ లో కూడా వారి కస్టమర్స్ యొక్క ప్రతి పర్చేజ్ పై అలానే మార్జిన్స్ పొందుతూ వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ఉంటుంది అని తెలియజేశారు.అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కి కూడా ఇన్వెంటరీ సప్లై చైన్ ప్రోడక్ట్ డామేజ్ వీటి మీద వెచ్చించే ఖర్చు పూర్తిగా పూర్తిగా తగ్గిపోతుంది అని తెలిపారు

రేస్‌విన్ మార్ట్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు ఇంటి వద్దకే బుక్ చేసుకున్న ఉత్పత్తులను అందిస్తామన్నారు . వ్యాపారులు షాపును రన్ చేయడానికి ఒక యాప్ ను కస్టమర్ల కోసం మరో యాప్‌ను అందుబాటులో ఉంచామని ఫౌండర్ ,సీఈఓ వెంకట్ తెలిపారు. బహుళజాతి కంపెనీలకు చెందిన ఉత్పత్తులతో పాటు లోకల్‌గా తయారయ్యే ఉత్పత్తులు విక్రయించుకునే అవకాశం కల్పిస్తామన్నారు .డిజిటల్ దుకాణం ప్రారంభించుకోవాలనుకునే వారికి రేస్విన్ యాప్ చక్కిటి పరిష్కారం అందిస్తుందన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *