ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా బీజేపీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సామ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిస్కరించారు. ఆగస్టు 28 ఉదయం 9గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర అధక్షులు బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని… అమ్మవారి దీవెనలు తీసుకొని రాష్ట్ర నలుమూలలా ప్రతి ఒక్కరిని కలుపుకుని ప్రజా సంగ్రామ యాత్రకు బయలు దేరుతారని చెప్పారు .ప్రజా సంగ్రామ యాత్రను రంగారెడ్డి జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కఈతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బోనంతో స్వాగతం పలకాలన్నారు. తెలంగాణ రాష్ట్రం బీజేపీతోనే సాధ్యమైందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్నారు.టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు .బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క ఇంటి గడపలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై వివరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సి కమిషన్ మాజీ సభ్యులు రాములు , కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ , మోహన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి భుపేందర్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి,కార్యదర్శి అనిల్ గౌడ్ ,జిల్లా ఓబీసీ మోర్చా నాగుల్ గౌడ్ , గౌరవ కార్పొరేటర్లు,జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ నుండి అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు.