మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తాం: గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ ఫౌండర్ ఉమా పేరి
హైదరాబాద్, బంజారాహిల్స్
మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు.. మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ,ఉపాధి అవకాశాలు పెంపొందించడమే ధ్వేయంగా గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ పని చేస్తుందని సంస్థ ఫౌండర్ ఉమా తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్లాటినం హోటల్ లో గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ బిజినెస్ మీట్ నిర్వహించారు. మహిళలు పురుషులపై ఆధారపడకుండా ..స్వయం శక్తితో ఎదిగేందుకు గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ పూర్తి సహకారం అందిస్తుందని ఆమె అన్నారు . గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినెల బిజినెస్ మీట్ లు నిర్వహిస్తూ మహిళల ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తామని గోల్డెన్ ఉమెన్స్ క్లబ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రూపా ,సుధాజైన్ లు తెలిపారు. అనంతరం మహిళ శక్తిని నిరూపించుకునేందుకు నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆకట్టుకుంది
ఈ కార్యక్రమంలో గోల్డెన్ ఉమెన్ క్లబ్ వ్యవస్థాపకులు ఉమా పెరి నోదార్ ,సంస్థ వైస్ ప్రెసిడెంట్ రూపా వెరోనికా, సుప్రియ బద్వే, డాక్టర్ సుధా జైన్, డాక్టర్ సుధా వాణి, డాక్టర్ విజయశ్రీ వేదగిరి తదితరులు పాల్గొన్నారు.