పిల్లలకు అధునాతన పరిజ్ఞానాన్ని అందించాలి : బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం

హైదరాబాద్ ,బేగంపేట

స్తుత ప్రపంచంలో పిల్లలకు తల్లిదండ్రులు అధునాతన పరిజ్ఞానాన్ని అందించాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేగంపేట లోని హోటల్ ప్లాజా లో తల్లిదండ్రులకు నిర్వహించిన ప్రైడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల అతి గారాబం పిల్లల పాలిట శాపంగా మారుతొందని తెలిపారు. పిల్లల పట్ల మితిమీరిన ప్రేమ మంచిది కాదని, బాధ్యతలను నిర్వహించుకునే అవకాశం వారికి కల్పించడం మంచి ఫలితాలను ఇస్తుందని తెలిపారు.

పిల్లల్లో స్వయం నిర్ణయాధికారం పెంచే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచించారు. ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ పిల్లల వ్యక్తిత్వ వికాసం లో కుటుంబానికి కీలక పాత్ర ఉందని తెలిపారు. ఇంట్లో మంచి వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. అనంతరం ఆయన పిల్లల పెంపకంలో మెళుకువలు వివరించారు.

విశ్రాంత ఆచార్యులు వంగపల్లి విశ్వనాధం మాట్లాడుతూ నైతికత, విలువల గురించి పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలని, మంచిని ఎంచుకునే ఈ విధంగా వారిని తీర్చిదిద్దాలని తెలిపారు. బాధ్యతాయుతమైన పేరెంటింగ్ తో మంచి సమాజం ఏర్పడుతుందని వివరించారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఈదా శామ్యూల్ రెడ్డి మాట్లాడుతూ తమ ఇంట్లో జరిగిన ఘటన మరో ఇంట్లో జరగకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్థాపించామని తెలిపారు. యువత ఆలోచన విధానం మార్చడం ద్వారా వారిని సన్మార్గంలో నడిపే అవకాశం ఉంటుందని భావించి ఆ దిశగా కార్యక్రమలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పిల్లలతో ముడిపడి ఉండే అన్ని వర్గాలను చేరుకుంటూ అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు ఈదా నిర్మల , డైరెక్టర్ ఈదా అంజి రెడ్డి, బిజెపి మహిళా మోర్చా నాయకురాలు అల్కా మనోజ్, మెజిస్ట్రేట్ బండారు జయశ్రీ, డాక్టర్ ఉషా కిరణ్, పౌండేషన్ జాతీయ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *