ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ కన్నుమూత

ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ కాసేపటి క్రితం కన్నుమూశారు. అహ్మదాబాద్ నగరంలోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో హీరాబెన్ మోదీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం తన తల్లి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు.హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో మరణించారు.