ఆస్పత్రిలో ప్రధాని మోదీ తల్లి
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను గుజరాత్ అహ్మదాబాద్ లోని UN మెహతా ఆస్పత్రిలో జాయిన్ చేశారు. హీరాబెన్ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. తల్లిని చూసేందుకు మోదీ అహ్మదాబాద్ వెళ్లే అవకాశం ఉంది. కాగా, ఇటీవలే హీరాబెన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా మోదీ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
