ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కుయుక్తులకు పాల్పడుతున్నారు : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్:
పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌తో ఫోన్‌లను హ్యాక్ చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు చేసిన పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను.. విపక్షాలు, జడ్జీలు, జర్నలిస్టులపై ఉపయోగించడం హేయమన్నారు. ఈ ప్రభుత్వం దేశభద్రతకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. విపక్ష నేతలు, జడ్జీలు సహా ప్రముఖుల ఫోన్‌లను హ్యాక్ చేయడం దారుణమన్నారు. అధికారం నిలబెట్టుకోవడానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా కుయుక్తులకు పాల్పడుతున్నారని, పెగాసెస్ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న చలో రాజ్‌భవన్‌కు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.