గోవాలో ఘనంగా ప్రణీత్ గ్రూప్ వార్షికోత్సవ వేడుకలు

రియ‌ల్ ఎస్టేట్ ఉద్యోగులు ఆటా పాట‌ల‌తో సంద‌డి చేశారు. గోవాలోని ఓ రిసార్ట్స్ లో హైద‌రాబాద్ కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ సంస్థ ప్రణీత్‌ గ్రూప్‌… 15వ వార్షికోత్సవ వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంది .

2007లో ప్రారంభమైన ప్ర‌ణీత్ గ్రూప్ …గత 15 సంవ‌త్స‌రాలుగా ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేరుస్తోంది. సిటీకి చేరువ‌లో విల్లాలు, ఫ్లాట్ లు , ఒపెన్ ఫ్లాట్లును అందిస్తూ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు పొందింది.

తెలంగాణ‌లో 30 కి పైగా ప్రాజెక్ట్ ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి… 15 వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది . ఈ ఏడాది యాన్యువ‌ల్ డే సెల‌బ్రేష‌న్స్ ను గోవాలో సంస్థ ఉద్యోగుల‌తో క‌లిసి జ‌రుపుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని ప్ర‌ణీత్ గ్రూప్ ఛైర్మ‌న్ న‌రేంద్ర కుమార్ కామరాజు అన్నారు .

అనంత‌రం కేక్ క‌ట్ చేసిన సంబురాలు జ‌రుపుకున్నారు .

ఈ వేడుకల్లో సంస్థ డైరెక్టర్లు నర్సిరెడ్డి, ఆంజనేయ రాజు, దినేష్ రెడ్డి, ఆదిత్య, సందీప్‌ రావుతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *