గద్వాల్ లో పీఎం టీ20 క్రికెట్ కప్
హైదరాబాద్
ఆజాద్ కి అమృత ఉత్సవ్.. ఖేలో ఇండియాలో భాగంగా ప్రధాన మంత్రి కప్ ను గద్వాల్ లో నిర్వహిస్తున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలు డీకే అరుణ వెల్లడించారు.

టోర్నీ డ్రాను హాదరాబాద్ లోని తన నివాసంలో అరుణ ఆవిష్కరించారు. ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు ఈ టీ20కప్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 జట్లు పాల్గొంటున్నాయని టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి చెప్పారు.