చిన్నారుల్లో మానసిక రుగ్మతలను రూపుమాపేందుకు ముందుకు వచ్చిన పినాకిల్ బ్యూమ్స్
హైదరాబాద్
చిన్నారుల్లో వచ్చేఅటిజం సమస్యలతో పాటు మానసిక రుగ్మతలకు చికిత్స అందించేందుకు పినాకిల్ బ్యూమ్స్ సంస్థ ముందుకు వచ్చింది. సికింద్రాబాద్ కార్ఖానాలో నూతనంగా ఏర్పాటు చేసిన పినాకిల్ బ్లూమ్స్ అటిజం థెరిపి సెంటర్‌ను
సంస్థ ప్రతినిధి పృథ్వి ప్రారంభించారు . పినాకిల్ బ్లూమ్స్ అటిజం థెరిపి సెంటర్ ద్వారా అటిజంతో బాధపడుతున్న చిన్నారుల సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది
చిన్నారులు అటిజం వ్యాధితో బాధపడుతున్నారని పృథ్వి ఆవేదన వ్యక్తం చేశారు . పిల్లలలో కలిగే మానసిక సమస్యలకు వంద శాతం పరిష్కారం చూపించేమార్గాలను అందిస్తుందన్నారు.పినాకిల్ బ్యూమ్స్ నెట్ వర్క్
దేశ వ్యాప్తంగా వేలాది మందిలో మానసిక రుగ్మతలకు సొల్యూషన్ అందిస్తుందని వివరించారు. దేశ ,విదేశాల నుంచి ప్రతి రోజుఎంతో మంది తమ మానసిక సమస్యలకు భారత్ హెల్త్ కేర్ ద్వారా పరిష్కారాలను పొందుతున్నారని
ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు . ఈ పినాకిల్ బ్యూమ్స్ అటిజం థెరిపి సెంటర్‌లలో ఆన్‌లైన్ ,ఆఫ్‌లైన్ ద్వారా అటిజం సమస్యను పరిష్కరిస్తామన్నారు .
పినాకిల్ బ్యూమ్స్ అటిజం థెరిపి సెంటర్ ద్వారా అటిజం చికిత్స అందించడంతో పాటు యువకులకు స్వయం ఉపాధి అవకాశాలుకల్పించేందుకు కృషి చేస్తుందని డైరెక్టర్ పృథ్వీ తెలిపారు. కరోనా కారణంగా సరైన సమయంలో చికిత్స అందించడంలో
ఇబ్బందులు కలుగకుండా ఆన్‌లైన్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు ఆయన వివరించారు.