ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
హైదరాబాద్, ఆగస్ట్ 30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరుకుంది.
హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశిస్సులు తీసుకుని ప్రారంభించిన ప్రజా సంగ్రామ పాదయాత్ర బాపుఘాట్ నుంచి అరే మైసమ్మ ,హిమాయత్ సాగర్ కు చేరుకుఉంది. నియంతృత్వ ,కుటుంబ,అవినీతి పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణను కాపాడేందుకు చేపడుతున్న బండి సంజయ్ పాదయాత్రకు బీజేపీ శ్రేణులు ,ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారు. ఆదివారం ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాలికి గాయమైంది. నిన్న లంగర్ హౌజ్ వద్ద సంజయ్ యాత్ర చేస్తున్న సమయంలో.. ఆయనను కలిసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తును పోటీపడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో సంజయ్ కిందపడిపోగా.. ఆయన కాలికి గాయమైంది. అనంతరం డాక్టర్లు సంజయ్‌కి చికిత్స అందించారు. ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు.తెలంగాణలో అవినీతి పాలన సాగుతోందని.. కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రం వాడుకుంటున్నారని ఆరోపించారు. మూడో రోజుకు చేరిన సంజయ్ పాదయాత్రకు మద్దతుగా బాపు ఘాట్ నుండి అరే మైసమ్మ ,హిమాయత్ నగర్ వరకు బీజేపీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాదయాత్రలోపాల్గొన్నారు.