15వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన

16న ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ పర్యటనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో, పార్టీ వాలంటీర్లతో సమావేశమవుతున్నారు. 16వ తేదీన విశాఖప6ట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆయా జిల్లాల నుంచి ప్రజా సమస్యలపై వచ్చే వినతులను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారు. 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *