గ‌చ్చిబౌలి వివిసీ మోటార్స్ షోరూం నుంచి టాటామోటార్స్, మ‌హింద్రా కార్ల‌తో సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన ట్రాన్స్ పోర్ట్ క‌మిష‌న‌ర్ పాపారావు

హైద‌రాబాద్ ,గ‌చ్చిబౌలి

దేశంలో అత్యాధునిక భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు క‌లిగిన టాటా మోటార్స్ , ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌లో ముందున్న మ‌హింద్రా కార్ల‌తో రోడ్ సేఫ్టీ డ్రైన్ నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని ట్రాన్స్ పోర్ట్ క‌మిష‌న‌ర్ పాపారావు అన్నారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని టాటా వెంకటరమణ, కొత్తగూడ వివిసి మహీంద్రా షోరూమ్‌ల నుంచి రోడ్ సేఫ్టీ డ్రైవ్ ను ట్రాన్స్ పోర్ట్ క‌మిష‌న‌ర్ పాపారావు,గ‌చ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ ఐ నాగిరెడ్డి, వివిసి మోటార్స్ ఎండీ వివి రాజేంద్రప్రసాద్ లు రోడ్ సేఫ్టీ డ్రైవ్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కొత్తగూడ సర్కిల్,హైటెక్ సిటీ, సైబర్ టవర్ ,జె.ఎన్.టీ.యూ సర్కిల్, ఆల్విన్ సర్కిల్‌ వరకు కొనసాగింది.ముఖ్యమైన ప్రతీ చౌరస్తాలో వాహనాలు నడిపే ప్రయాణీకులకు అర్ధమయ్యేలా వాహనం నడిపేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వివిసి మోటార్స్ మేనేజ్‌మెంట్ వివరించింది. వాహనం నడిపేటపుడు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని,డ్రింక్ అండ్ డ్రైవ్ ప్రమాదకరమని,ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు..ఈ సందర్భంగా వివిసి మోటార్స్ ఎం.డీ వివి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..ఒక మంచి ఉద్దేశంతో భారతదేశపు ఉత్తమ సేఫ్టీ కార్లు అయిన టాటా , మహీంద్రా కార్లతో రోడ్ సేఫ్టీ డ్రైవ్ ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ డ్రైవ్ లో టాటా వెంకటరమణ మోటార్స్ భాగ‌స్వామ్యం కావ‌డం … మ‌రింత ఆనందాన్ని అందించింద‌న్నారు.

నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ వ‌ల్ల ప్ర‌తి ఏటా ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని…సేఫ్టీ ప్రికాష‌న్స్ తీసుకుంటే మ‌న‌తో పాటు ఇత‌రుల ప్రాణాలు కాపావ‌డ‌వ‌చ్చి తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిసరిగా ట్రాఫిక్ రూల్స్ … సేఫ్టీ నియమాలను పాటించాల‌ని కోరారు. ఈ రోడ్ సేఫ్టీ డ్రైవ్‌లో రాయల్ ఇన్‌ఫీల్డ్ బైక్స్ యాజ‌మానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *