పంజాగుట్ట హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం నాగేందర్

సాంప్రదాయ డెక్కనీ వంటకాలకు నిలయంగా పిలువబడే హైదరాబాద్ హవుస్, నిజమైన హైదరాబాదీ ఫుడ్ బ్రాండ్
సంవత్సర కాలంలోనే పంజాగుట్టలో తమ రెండవ అవుట్ లెట్ ను ప్రారంభించడం ద్వారా అభివృద్ది దిశగా పయనం

1975 లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన హైదరాబాద్ హవుస్ రెస్టారెంట్ బ్రాండ్ ను అత్యున్నత శ్రేణి, నాణ్యత కు చెందిన ముడి పదార్థముల వినియోగంతో పాటూ చారిత్రాత్మకమైన డెక్కనీ రుచులకు నమ్మకమైన పేరుగా భావించబడడమే కాకుండా అత్యంత నాణ్యతతో కూడిన పరిశుభ్రతకు పెట్టింది పేరుగా హైదరాబాదీయులు నమ్ముతారు. తమ మొదటి అవుట్ లెట్ ప్రారంభించిన ఏడాది లోగా పంజాగుట్టలో రెండవ అవుట్ లెట్ ను హైదరాబాదు హవుస్ రెస్టారెంట్ ఛైన్ నేడు ప్రారంభించింది.

పంజాగుట్ట నూతన అవుట్ లెట్ ను ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ హైదరాబాదు లాంటి పెద్ద నగరాలలో ఉండే రెస్టారెంట్ లలో పరిశుభ్రమైన ఆహారం మరియు శుభ్రమైన పరిసరాలు ఉండే చూడడం ఎంతో ఆవశ్యకత అని అన్నారు. వీటిని పాటించడంలో హైదరాబాద్ హవుస్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. నూతన అవుట్ లెట్ ను ప్రారంభించిన రెస్టారెంట్ యాజమాన్యం, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండవ అవుట్ లెట్ ప్రారంభించడంతో పాటూ నగరంలోని ఇతర ప్రదేశాలలో కూడా నూతన అవుట్ లెట్ లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న హైదరాబాదు హవుస్ పురోగతిని అభినందించారు.

అనంతరం హైదరాబాదు హవుస్ స్థాపించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యాలను వివరిస్తూ రెస్టారెంట్ ప్రారంభించాలన్న ఐడియా వెనుక దశాబ్దాల కృషి దాగి ఉందన్నారు. హైదరాబాదు నగరంలోనే పెద్ద కాటరింగ్ కాంట్రాక్టర్ గా అందరి మన్ననలను అందుకొని పేరు గడించిన తన తండ్రి మీర్ మజారుద్దీన్ ద్వారా హైదరాబాద్ హవుస్ రెస్టారెంట్ బ్రాండ్ స్థాపించడం జరిగిందని వివరించారు. కేటరింగ్ వ్యాపారంలో ఎంతో పేరు గడించిన తర్వాత డెక్కనీ వంటకాలను రుచి చూపించాలని ఎందరో ఆయనను కోరే వారని అయితే చిన్న చిన్న పరిణామాలలో వీటిని వండి అందించడం సాధ్యపడదని భావించిన ఆయన హైదరాబాద్ హవుస్ ను ముందుగా టేక్ అవే (ఆర్డర్ ఇచ్చి ఇంటికి తీసుకొని వెళ్లడం) అనే ఫార్మట్ లో ప్రారంభించారని తెలిపారు. తదనంతరం అదే రెస్టారెంట్ చెయిన్ గా రూపొందిందని వివరించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దానం నాగేందర్ తో పాటూ పార్టనర్ బి మహమ్మద్ ఆరిఫ్, , పంజాగుట్ట హైదరాబాద్ హవుస్ వ్యవస్థాపకులు మీర్ మజారుద్దీన్, , మీర్ జుబైర్ అహమ్మద్, డెరెక్టర్, ఆదిత్య రావు లింగాల, డెరెక్టర్, బిజినెస్ డెవలెప్మెంట్ మరియు మార్కెటింగ్, హైదరాబాద్ హవుస్ – కౌశిక్ చుండి, జనరల్ మేనేజర్, ఆపరేషన్స్, హైదరాబాదు హవుస్ తో పాటూ పలువురు శ్రేయోభిలాషులు, ఆహార ప్రేమికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *