ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ‘రిపీట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ మేనేజ్‌మెంట్ క్లినిక్’ ను ప్రారంభించిన ఆరిజిన్ ఫెర్టిలిటీ
ఐవిఎఫ్ వైఫల్యం అనేది 40% నుండి 60% వరకు ఎక్కువగా ఉంటున్నది
ఇప్పటికే పిల్లలు లేక బాధపడే జంటలకు మళ్లీ చేసే ఐవిఎఫ్ చికిత్స మరింత మానసిక గాయాన్ని చేస్తుంది
ఆరిజిన్ ఫెర్టిలిటీ ఫెయిల్యూర్ ఐవిఎఫ్ ఉన్న జంటలకు తల్లిదండ్రులు కావడంలో విజయవంతమైన ట్రాక్ రికార్డ్ వుంది
హైదరాబాద్
తల్లిదండ్రులు కావాలనే తపనతో ఐవిఎఫ్ వైఫల్యాన్ని ఎదుర్కొంటున్న దంపతుల కోసం రిపీట్ ఐవిఎఫ్ ఫెయిల్యూర్ మేనేజ్‌మెంట్ (ఆర్‌ఐఎఫ్‌ఎమ్) క్లినిక్‌ను ప్రారంభించినట్లు ఆరిజిన్ ఫెర్టిలిటీ క్లినిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులు, డాక్టర్ రింకీ తివారీ తెలిపారు.
ఆరిజిన్ ఫెర్టిలిటీ ఎండోక్రినాలజీ, ఇమ్యునాలజీ, జెనెటిక్స్, ఎంబ్రియాలజీ మరియు ఆండ్రాలజీ వంటి స్పెషాలిటీలతో అత్యంత అనుభవజ్ఞులైన నిపుణులతో సమగ్రమైన అనేక విభిన్న అంశాలతో సంతాన సాఫల్య చికిత్సను అందిస్తుంది, వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందిస్తుంది. ఆరిజిన్ ఫెర్టిలిటీ తల్లితండ్రులు కావాలని కోరుకునే వారి కలను నెరవేర్చడం ద్వారా అంతకుముందు ఐవిఎఫ్ ఫెయూల్యూర్‌ను ఎదుర్కున్న అనేక జంటలకు సహాయం చేయడంలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగివుంది.
చికిత్స అందిస్తున్న ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌లకు మరియు బిడ్డ కోసం ఆరాటపడే అనేక జంటలకు రిపీటెడ్ ఐవిఎఫ్ ఫెయిల్యూర్ అనేది ఎంతో కాలంగా మింగుడుపడని సమస్యగా ఉంటున్నది. ఇలా జరగడం అనేది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి కఠినమైన సవాలు. చాలా బాధ కలిగించే అంశం ఏమిటంటే, నిపుణుల నైపుణ్యం మరియు ఫెర్టిలిటీ సెంటర్‌లోని మౌలిక సదుపాయాల స్థితిని బట్టి ఐవిఎఫ్ వైఫల్యం 40% నుండి 60% వరకు ఎక్కువగా ఉంటున్నది. అనేక జంటలు తరచుగా వారి రెండవ లేదా మూడవ ఐవిఫ్ ప్రయత్నంలో గర్భం దాల్చుతారు. పదేపదే ఐవిఎఫ్ వైఫల్యం ఇప్పటికే పిల్లలు లేక బాధపడుతున్న జంటలకు మానసికంగా మరింత తీవ్రంగా కుంగిపోవచ్చు. ఇది వారికుండే ఆర్థిక వనరులను హరిస్తుంది, శారీరకంగా మరియు మానసికంగా కూడా ఇది శ్రమతో కూడుకున్నది మరియు అన్నింటికి మించి ఇది గొడ్రాలు అనే సామాజిక కళంకాన్ని తెస్తుంది. కృత్రిమ గర్భధారణను ఎంచుకోవడానికి తీవ్రమైన ఉద్వేగభరితమైన భావనతో ప్రారంభించి, గర్భం ధరించడంలో వారి అసమర్థతను గ్రహించి, బిడ్డను కృత్రిమంగా గర్భం ధరించాలనే ప్రక్రియ వైపు జంటలు మొగ్గు చూపుతారు, అప్పటికే దంపతులు వయస్సు మీరడం వలన ఆప్షన్లు అనేవి మూసుకుపోతాయి.
ఐవిఎఫ్ ద్వారా గర్భం దాల్చలనే ప్రక్రియ పదేపదే వైఫల్యాలు చెందడానికి గర్భాశయ గోడ (యూటెరస్ వాల్)కు అమర్చడంలో వైఫల్యం, తల్లి లేదా పిండంతో సంబంధం ఉన్న సమస్య, జంట యొక్క అనారోగ్య జీవనశైలి మరియు అలవాట్లు, ఊబకాయం, స్త్రీ వయస్సు, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, జన్యుపరమైన సమస్యలు, మెటర్నల్ ఆటో యాంటీబాడీస్ కారణంగా మంచి పిండం తిరస్కరణ వంటి రోగనిరోధక సమస్యలు, ఎండోమెట్రియోసిస్ లేదా మునుపటి ఐవిఫ్ సరిగ్గా నిర్వహించబడకపోవడం మరియు కొన్నిసార్లు ఇడియోపతిక్ వంటి అనేక కారణాలు ఉంటాయి.
అయినప్పటికీ, ఫెర్టిలిటీ నిపుణుల నైపుణ్యంతో పాటు వేగంగా వృద్ది చెందుతున్న సాంకేతికత మరియు చికిత్సా పద్ధతులు సంతానం లేని దంపతులలో గొప్ప ఆశను రేకిత్తిస్తున్నాయి. ఆరిజిన్ ఫెర్టిలిటీ ఐవిఎఫ్ యొక్క రెండు నుండి మూడు విజయవంతం కాని సైకిల్స్‌కు గురైన అనేక జంటలను గర్భం దాల్చడానికి చికిత్స అందించింది, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే ఇది సాధ్యమైంది, ఈ రంగంలో తాజా అవకాశాలను వుపయోగించుకునేందుకు సాంకేతికత నిరంతరం అప్‌గ్రేడ్ చేయబడుతున్నది. అన్నింటికిమించి, నిరంతర పరిశోధనల మద్దతుతో అపారమైన అనుభవంతో ఆరిజిన్ ఫెర్టిలిటీలో అత్యంత శిక్షణ పొందిన నిపుణుల బృందం, పిల్లలు లేని జంటలకు సరైన చికిత్సను సూచిస్తూ విజయవంతం అవుతున్నది.
ఆరిజిన్ ఫెర్టిలిటీలో అత్యుత్తమమైన ప్రపంచ స్థాయి ఐవిఎఫ్ ల్యాబ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు అత్యంత అధునాతన ఎవిడెన్స్ బేస్‌డ్ శాస్త్రీయ పద్దతులు ఉన్నాయి, ఇవి ఎటువంటి ఐవిఎఫ్ విజయానికైనా 2 ముఖ్యమైన మూల స్తంభాలు. ఏదైనా విఫలమైన ఐవిఎఫ్ కేసు వచ్చినప్పుడు, మేము ఆ కేసును క్షుణ్ణంగా మూల్యాంకనం చేస్తాము, ఎందుకంటే తదుపరి ఐవిఎఫ్ విజయవంతం కావడంలో కీలకమైన అంశం ఇంతకుముందు విఫలమైన ఐవిఎఫ్ యొక్క సమాచారంలో ఉంటుంది, అని డాక్టర్ రింకీ తివారీ అన్నారు. మేము నిరంతరం తాజా పరిశోధన అప్‌డేట్‌లకు సమాంతరంగా ఉంటాము మరియు మెరుగైన ఫలితాలు రావడానికి వాటిని అనుసరిస్తాము, ఆని ఆమె తెలిపారు.
ఆరిజన్ ఫెర్టిలిటీ గురించి
ఆరిజిన్ ఫెర్టిలిటీ అనేది దక్షిణ భారతదేశంలోని సంతానోత్పత్తి కేంద్రాలలో ఒకటి, ఇది అన్ని శాస్త్రీయ మార్గదర్శకాలను నిశితంగా అనుసరిస్తుంది. వ్యవస్థాపకురాలు డాక్టర్ రింకే ఎస్ తివారీ తన శాస్త్రీయ జ్ఞానం, పారదర్శకత మరియు నైతిక అభ్యాసాల కోసం వైద్య సమాజంలో గుర్తింపు పొందారు. గర్భం దాల్చేందుకు దాత అండం కోసం ఎక్కడికైనా వెళ్లాలని సూచించబడిన, తక్కువ అండ నిల్వ వున్న రోగులకు కేంద్రం సమర్ధవంతంగా చికిత్సను అందించింది, డాక్టర్ రింకీ తన నైపుణ్యాలను మరియు ఐవిఎఫ్ యొక్క అధునాతన ప్రోటోకాల్‌లను ఉపయోగిస్తుంది, ఇది సొంత అండంతో గర్భధారణ చేయడానికి, అరిజన్ ఫెర్టిలిటీ సంతానోత్పత్తి అనేది సొంత అండం ఎవిఎఫ్‌ను ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ప్రతి వ్యక్తికి తమ స్వంత జన్యు పదార్థంతో గర్భం ధరించాలని ప్రయత్నించే హక్కు ఉంటుంది. తక్కువ అండవ నిల్వ కారణంగా ఐవిఎఫ్ విఫలమైనట్లు మునుపటి రికార్డు ఉన్నప్పటికీ, 40 ఏళ్లు పైబడిన మహిళలకు కేంద్రం తల్లిదండ్రులు అయ్యే అవకాశాన్ని అందించింది. గతంలో 5 విఫలమైన ఐవిఎఫ్‌లు ఉన్న ఒక మహిళకు దాత అండంతో గర్బం ధరించమని ఇతర ఫెర్టిలిటీ సెంటర్‌లు సలహా ఇచ్చారు, కానీ ఇక్కడ ఆమె తల్లి కావడంలో విజయవంతంగా సహాయం చేశారు.