ఆర్గానో సాఫ్ట్ వేర్ సంస్థ బ్రాండింగ్ తో కూడిన మెట్రోరైల్ ను జెండా ఊపి ప్రారంభించిన ఆర్గానో ఎండీ మధు శేరి
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఐటీ, డిజిటల్ ఫండేషన్ సేవలు అందిస్తున్న ఆర్గానో సంస్థ తన బ్రాండింగ్‌ను విస్తరించేందుకు హైదరాబాద్ మెట్రోరైల్‌ను ఎంచుకుంది. హైదరాబాద్ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ వద్ద ఆర్గానో బ్రాండింగ్‌తో ఉన్న హైదరాబాద్ మెట్రోరైల్ ను సంస్థ ఎండీ మధు శేరి ప్రారంభించారు.ఇండియాలో హైదరాబాద్ కేంద్రంగా ఆర్గానో సంస్థ పనిచేస్తుందని … త్వరలో మరింత విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు .మెట్రోరైలుపై ఆర్గానో సాఫ్ట్‌వేర్ సంస్థ బ్రాండింగ్ మరింత ప్రాచుర్యం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు . మూడు నెలల పాటు మెట్రో రైలుపై ఆర్గానో బ్రాండింగ్ ఉండేవిధంగా హైదరాబాద్ మెట్రోరైలుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు