సేంద్రియ వ్యవసాయం ద్వారా నాణ్యమైన పంట ఉత్పత్తులతో పాటు దిగుబడి పెరిగుతుంది : ఫార్మోవా ఫర్టిలైజర్స్ ఛైర్మన్ శివరామ కృష్ణ

హైదరాబాద్ ,మాదాపూర్

సేంద్రియ వ్యవసాయంపై ఇప్పుడిప్పుడే రైతులకు అవగాహన పెరుగుతుందని ఫార్మోవా ఫర్టిలైజర్స్ ఛైర్మన్ శివరామకృష్ణ అన్నారు .హైదరబాద్ ట్రైడెంట్ హోటల్‌లో ఫార్మోవా ఫర్టిలైజర్స్‌ నుంచి మూడు రకాల సేంద్రియ ఎరువులను మార్కెట్‌లోకి విడుదల చేశారు .త్వరలో మరో 15 రకాల సేంద్రియ,పురుగుమందులను అందిస్తామన్నారు .సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూ సారం పెంపొందించడంతో పాటు , రైతుకు ,మొక్కలకు మేలు జరుగుతుందన్నారు. మేడిన్ ఇండియా మేకిన్ హైదరాబాద్ కాన్సెఫ్ట్‌తో ఈ ఎరువులను తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు .కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సేంద్రియ వ్యవసాయనికి పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో ఫార్మోవా ఫర్టిలైజర్స్ మరింత డిమాండ్ పెరుగుతుందన్నారు . తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు .గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సేంద్రియ వ్యవసాయంపై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు శివరామకృష్ణ తెలిపారు .

ప్రస్తుత కాలంలో మనం పీల్చేగాలి, తాగే నీరు, తినే తిండి అన్ని విషపూరితంగా మారుతున్నాయి. గాలిని ఫిల్టర్ చేయడానికి మాస్క్‌లు ఎయిర్ ఫూరిఫైర్లు అందుబాటులోకి వచ్చాయి. నీటిని శుభ్ర చేసుకునేందుకు వాటర్ ఫిల్టర్లు ఉన్నాయి. ఇక మనం రోజు తినే ఆహారం, కూరగాయలు , పండ్లు, ఇతర పంటల్లో రసాయనిక ఎరువులు పురుగుమందు అవశేషాలు ఎన్నో ఉన్నాయి. దీంతో తక్కువ వయస్సులోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయం సేంద్రియ వ్యవసాయం . సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన పంట ఉత్పత్తులను వాటడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చుని సర్వేలు సైతం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడిన్ ఇండియా మేకిన్ హైదరాబాద్ కాన్సెఫ్ట్‌తో ఫార్మోవా ఫర్టిలైజర్ సంస్థ సేంద్రియ ఎరువులను అందుబాటులోకి తీసుకువచ్చింది. సేంద్రియ వ్యవసాయ సాగును ప్రొత్సహించాలనే ఉద్దేశంలో ఫార్మోవా ఫర్టిలైజర్స్ సంస్థ మూడు కొత్త సేంద్రియ ఎరువులను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు ఫార్మోవా ఫర్టిలైజర్స్ ఛైర్మన్ శివరామ కృష్ణ తెలిపారు .

సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూమి ఆరోగ్యంగా ఉండటంతో పాటు భూమి నుంచి వచ్చే పంట ఉత్పత్తులు విషపూరితం కాకుండా ఉంటాయని శివరామ కృష్ణ తెలిపారు . సేంద్రియ ఉత్పత్తులు వాడటం వల్ల పంట దిగుబడి సైతం పెరుగుతుందని ..నాణ్యత, రంగు, బరువు ఉంటుందని .. రైతుకు మంచి ధర వస్తుందన్నారు . రైతులు సైతం సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన తెలిపారు . కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్ళించేందుకు ప్రణాళికలు సైతం రచిస్తున్నాయని సంస్థ డైరెక్టర్ మాడపాతి భువన్ , సీఈఓ కురుడి సునీల్‌లు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *