వరి దోమ తెగలు నివారణకు ఆర్కెస్ట్రా పురుగుమందు ఎంతగానో దోహదపడుతుంది: నిచినో ఇండియా ఎండీ TOMOOKA NACHIRO
వరి దోమ తెగలు నివారణకు ఆర్కెస్ట్రా పురుగుమందు ఎంతగానో దోహదపడుతుంది: నిచినో ఇండియా ఎండీ TOMOOKA NACHIRO
జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆవిష్కరణ ఆర్కెస్ట్రా
వరి పంటలో వచ్చే సుడిదోమ నివారణతో పాటు మిత్ర పురుగులకు హాని తలపెట్టని రీతిలో ఆర్కెస్ట్రా పురుగుమందు పనిచేస్తుందని నిచినో ఇండియా ఎండీ TOMOOKA NACHIRO తెలిపారు. దోమ కారణంగా రైతులకు భారీ నష్టాలు ఏర్పడుతున్నందున రైతాంగం సుడిదోమ నిర్వహణ, నిర్మూలణకు జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పురుగుమందును తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. సుడిదోమ తీవ్రత అధికంగా ఉన్న చోట్ల రైతాంగం మందును 6-7 సార్లు స్ప్రే చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఈ మందు వినియోగం వల్ల మిత్ర పురుగులు నాశనం కాకుండా సుడిదోమను మాత్రమే నియంత్రిస్తుందని తెలిపారు.
రైతు పంట దిగుబడి కోసం నిచినో ఇండియా పలు పురుగుమందు ఉత్పత్తులను తయారు చేస్తుందన్నారు. హైదరాబాద్ హయత్ ప్లేస్ హోటల్ లో నిచినో ఇండియా ఉత్పత్తి చేసిన ఆర్కెస్రా పురుగుమందును నిచినో ఇండియా ఎండీ OMOOKA NACHIRO, డైరెక్టర్లు కెయస్ ఆర్ గోపాల్, డిజి శెట్టి, యం బలేరావు, హేమంత్ సింగ్ పాటు పలువురు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.
Benzpyrimoxan (BPX) అనే వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన మొట్ట మొదటి ఉత్పత్తి ఆర్కెస్ట్రా అని నిచినో ఇండియా డైరెక్టర్ డీజీ శెట్టి అన్నారు . పదేళ్ల పరిశోధనల ఫలితంగా రూపొందించబడిన ఈ ఆర్కెస్ట్రా ఒక వైపు సుడిదోమను సమర్థవంతంగా నిరోధించడమే కాకుండా పంటకు మేలు కలిగించే మిత్ర పురుగులను సంరక్షిస్తుందని చెప్పారు. అందుకే ఆర్కెస్ట్రా ను మార్కెట్లో ప్రవేశ పెట్టి రైతాంగానికి అందుబాటులో తీసుకువచ్చామన్నారు.
అనంతరం నిచినో ఇండియా ఎండీ TOMOOKA NACHIRO, మాట్లాడుతూ ఇండో జపాన్ సంబంధాలు నెలకొని 70 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా అందుబాటలో వస్తున్న ఈ ఉత్పత్తి రెండు దేశాల మధ్య సహకారానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. తాము భారత్ లో రైతాంగానికి అందిస్తున్న ఉత్పత్తులన్నీ అటు జపాన్ లో ఇటు భారత్ లోనూ ఒకే సారి వినియోగించేలా పరిశోధించి ఈ ఉత్పత్తులను రూపొందించామన్నారు. భారతీయ మార్కెట్ లోనే కాకుండా జపాన్ మార్కెట్ లోనూ అందుబాటులో ఉంటున్నాయని వివరించారు. ఇక మేన్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని భారతదేశంలో మరిన్ని ఉత్పత్తులను తయారు చేసేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు.
అనంతరం నిచినో ఇండియా సీటీఓ డైరెక్టర్ యం బలేరావు మాట్లాడుతూ ఆర్కెస్ట్రా ను సుడిదోమ ఎక్కువగా కనిపించే పలు ప్రాంతాలలో పంపిణీ చేసి పరీక్షించడం జరిగిందని చెప్పారు. దీనిని వినియోగించిన రైతాంగం సుడిదోమను నియంత్రణలో ఉంచడంలో ఆర్కెస్ట్రా పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా మిత్ర పురుగులు సురక్షితంగా ఉండడాన్ని కూడా గమనించారని చెప్పారు. అంతే గాకుండా ఆర్కెస్ట్రా యొక్క ఫైటో టానిక్ ఎఫెక్ట్ కారణంగా రైతుల పంట పచ్చగా ఉండడమే కాకుండా ధాన్యం కంకులు పుష్టిగా ఉండి ఎక్కువ దిగుబడి ఇవ్వడం జరిగిందని చెప్పారు.
కార్యక్రమంలో చివరగా నిచినో ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ హేమంత్ సింగ్ మాట్లాడతూ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే పలు రకాల తెగుళ్ల నివారణకు ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్ లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఇపుడు మార్కెట్ లో విడుదల చేసిన ఆర్కెస్ట్రాకు మంచి స్పందన వస్తోందని ..తాము తీసుకొని వచ్చే ఇతర ఉత్పత్తులను కూడా రైతాంగం ఆదరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
భారతీయ మార్కెట్ లో తమ సంస్థ 600 కోట్లకు పైగా టర్నోవర్ సాధించిందని … రానున్న రెండు సంవత్సరముల కాలంలో దీనిని వెయ్యి కోట్ల రూపాయాలకు చేర్చాలనేది తమ లక్ష్యమని నిచినో ఇండియా ఎండీ TOMOOKA NACHIRO వివరించారు. ప్రస్థుత ఆర్థిక సంవత్సరంలో ఇపుడు మార్కెట్లో విడుదల చేస్తున్న ఆర్కెస్ట్రా అనబడే ఉత్పత్తితో పాటూ మరో మూడు ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి సన్నధ్దమైనట్లు చెప్పారు. దీంతో ప్రస్థుతం భారతీయ ఆగ్రో కెమికల్ మార్కెట్లో ఉన్న 3 శాతం మార్కెట్ షేర్ ను 5 శాతానికి పెంచుకోవడానికి వీలవుతుందని చెప్పారు. భారతీయ మార్కెట్లో ఆగ్రో కెమికల్స్ విభాగంలో 3 శాతం వాటాను కలిగి ఉంటే అదే సమయంలో మర్చి మరియు వరి పంటల విభాగంలో 5 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నామని చెప్పారు. తమకు ప్రస్థుతం దేశంలో నాలుగు ఉత్పత్తి కేంద్రాలు మరియు ఒక పరిశోధన కేంద్రం ఉన్నాయని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ స్పూర్తితో భారత ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించుకొని భారతీయ మార్కెట్ లో ఒక అగ్రగామి ఆగ్రో కెమికల్ కంపెనీగా ఎదుగుతామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.