హైదరాబాద్ లో టీజీ క్యాంపస్ కార్పొరేట్ కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్
దేశంలో నాణ్యమైన విద్యను ఆన్ లైన్ ద్వారా అందిస్తున్న టుమారోస్ జీనియస్ ( Tomorrows Genius ) క్యాంపస్ తమ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రచించింది. దేశంలోని పలు నగరాల్లో కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు ముందుకు వచ్చింది .హైదరాబాద్ ఖైరతాబాద్ లో నూతనంగా ఏర్పాటుచేసిన టీజీ క్యాంపస్ కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో తమ కార్యాలయాలు ప్రారంభించినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో క్యాంపస్ ను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ.. పోటీ పరీక్షల విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలు సృష్టించేందుకు సంస్థ పనిచేస్తుందన్నారు. 8,9,10 వ తరగతుల విద్యార్దులకు SAT, CLAT, IPMAT లాంటి ఫౌండేషన్ కోర్సులతో పాటు.. 11, 12 తరగతుల విద్యార్థులకు JEE, NEET లతో పాటు CA ఫౌండేషన్ కోర్సులను అందిస్తున్నట్లు వారు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా కోర్సులు, శిక్షణ కార్యక్రమాలు, కోర్సు సృష్టి, ట్రాకింగ్, షెడ్యులింగ్, రిపోర్టింగ్ లాంటి సులభమైన ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు TG క్యాంపస్ ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చిందని ఆయన స్పష్టం చేశారు.