హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఊటీ కేఫ్ ప్రారంభం
హైదరాబాద్
ఊటీ ,డార్జిలింగ్ ప్రదేశాల్లో మాత్రమే లభించే ప్రీమియం టీ ఉత్పత్తులు హైదరాబాదీయులకు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక వేత్త ,వ్యాపారవేత్త డాక్టర్ గీతాంజలి అన్నపురెడ్డి ఇతర భాగస్వాములతో కలిసి ఏర్పాటు చేసింది. ఈ ఊటీ టీ కేఫ్‌ను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కార్పోరేటర్ డేరనాగుల వెంకటేష్ లు ప్రారంభించారు.
నగరంలోని టీ ప్రేమికుల కోసం ఊటీ కేఫ్ తన మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది.హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో ఉన్నకేఫ్‌లో దేశ,విదేశాలకు చెందిన 100 రకాల టీ రుచులను అందిస్తున్నారు.
ఊటీ కేఫ్ వివిధ టీ రకాల్లో ఎంతో ప్రత్యేకత కలిగి ఉందని నిర్వహకులు గీతాంజలి తెలిపారు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నలుపు, తెలుపు, నీలం, ఊదా ,తెలుపు ,గోల్డెన్ టీ వంటి 100 రకాల టీ లు ఇక్కడ లభిస్తాయని ఆమె తెలిపారు. టీ ప్రియుల కోసం 1200 చదరపు గజాల విస్తీర్ణం గల 3 అంతస్తుల సూవిశాలా భవనంలొ 250 మంది సీటింగ్ కెపాసిటీ ఉండేలా ఏర్పాటు చేశామన్నారు . బహుళ నేపథ్య కేఫ్ ఊటీ హిల్ స్టేషన్‌పై ఆధారపడి ఉందని.., ఇది ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. టీ ఉత్పత్తులను ఊటీ , డార్జిలింగ్ నుండి ప్రీమియం టీ ఉత్పత్తులు విదేశాల నుండి కొనుగోలు చేస్తున్నామన్నారు. కేఫ్‌లో కాంటినెంటల్ ఫుడ్, వెస్ట్రన్ ఫుడ్ , ఆల్కహాల్ లేని పానీయాలు అందుబాటులో ఉంచామని తెలిపారు .ఈ టీ ధర 140 రూపాయల నుండి ప్రారంభమవుతుందన్నారు.
ఒక ప్రత్యేక వర్క్‌స్టేషన్ క్యాబిన్‌తో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇండోర్ కాన్సెప్ట్ థీమ్ ను కలిగి ఉందని గీతాంజలి తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ట్రీ-హౌస్ కాన్సెప్ట్ సందర్శకులకు ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం జలపాతాల భావనను కలిగి ఉంటుందన్నారు. మొదటి అంతస్తులో స్పోర్ట్స్ జోన్, రెండు ప్రైవేట్ క్యాబిన్‌లు, హోమ్ థియేటర్ ఉన్నాయని వివరించారు.రూప్ టాప్ సరైన ఎడ్జ్ సిస్టమ్‌తో కూడిన పబ్ కాన్సెప్ట్‌ను పోలి ఉంటుందన్నారు. 60-80 మంది కూర్చునే ఏర్పాటును కలిగి ఉందని డాక్టర్ గీతాంజలి అన్నపురెడ్డి వివరించారు.
కేఫ్ ప్రారంభోత్సవంలో కేఫ్ సహ వ్యవస్థాపకులు విశాఖ అగర్వాల్, సింధూర పాలగుళ్ల, తిరుమల్ రెడ్డి శ్రీకాంత్, పాలబట్ల తరుణ్, సీహెచ్ వెంకట రెడ్డి కొవ్వూరి, నరోత్తం సర్దా, మట్టా సప్నా రాణి, బెజగం నితిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు