264 కాలనీల్లో వంద శాతం వాక్సిన్ పూర్తి ..తొలిరోజు 26,892 మందికి కోవిద్ వాక్సినేషన్ అందించాం:జీహెచ్ఎంసీ

హైదరాబాద్

దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన గ్రేటర్ హైదరాబాద్ లో అర్హులైన వారందరికీ 100 శాతం కోవిద్ వాక్సిన్ అందించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతం అయింది. మొదటి రోజైన సోమవారం నాడు 26,892 మందికి వాక్సిన్ ఇవ్వగా, 264 కాలనీలు 100 శాతం వాక్సిన్ తీసుకున్న కాలనీలుగా ప్రకటించి వారికి ప్రత్యేక అభినందన సర్టిఫికెట్ లను అందచేశారు. జీహెచ్ఎంసీ లోని 4846 కాలనీలు, బస్తీల్లో పూర్తి స్థాయిలో కోవిద్ వాక్సిన్ అందచేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేటి నుండి పది రోజుల పాటు ఈ ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ ను జీహెచ్ఎంసీ చేపట్టింది. తొలి రోజైన నేడు 175 బృందాలు 448 కాలనీల్లో ప్రత్యేక క్యాంప్ లు నిర్వహించాయి. సంచార కోవిద్ టీకా వాహనాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నేడు 23651 మందికి మొదటి డోస్ ను అందచేయగా, 3241 మందికి రెండవ డోస్ టీకా ను అంద చేసారు. మొదటి, రెండో డోసులతో కలిపి మొత్తం 26892 మందికి వాక్సిన్ వేశారు. కాగా, నేడు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో తొలిరోజు 264 కాలనీలను 100 శాతం వాక్సిన్ తీసుకున్న కాలనీగా గుర్తించామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. కాగా, నగరంలో ప్రారంభించిన ఈ మేఘా మొబైల్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్జ్వి, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ లు పరిశీలించారు. హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జీహెచ్ ఎంసీ సీనియర్ అధికారులు పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *