ఒకరి రక్తదానం తో ముగ్గురు చిన్నారులను కాపాడుకోవచ్చు: నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణ

ఒకరు రక్తదానం చేయడం ద్వారా ముగ్గురు చిన్నారులను రక్షించిన వారమవుతామని నీలోఫర్ ఆసుపత్రి సుపరింటెండెంట్ మురళీ కృష్ణ అన్నారు .హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 75 వ  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పిడియాట్రిక్ అకాడమి ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో స్పెషల్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. తెలంగాణలోని చిన్నపిల్లల వైద్యులంతా కలిసి ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజున రక్తదానం చేపడుతున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఆసుపత్రి సుపరింటెండెంట్ మురళీ కృష్ణ , వైద్యులు, వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు . రక్తదానం, అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిడియాట్రిక్ అకాడమి ఆఫ్ తెలంగాణ స్టేట్ కృషి చేస్తుందన్నారు.

త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్నచిన్నారులకు ఒకరు రక్తదానంతో ముగ్గురు చిన్నారులను కాపాడుకోవచ్చన్నారు వైద్యులు . రోగులకు క్ర‌మంత‌ప్ప‌కుండా ర‌క్తం అవ‌స‌ర‌మ‌వుతూ వుంటుందని ..వారికి స‌మ‌యానికి ర‌క్తం ఎక్కించ‌క‌పోతే ప్రాణాలు పోయే ప్ర‌మాద‌ముంటుందన్నారు. కరోనా సమయంలో బ్ల‌డ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడిందన్నారు. ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాలు విరివిగా ఏర్పాటు చేయ‌డంద్వారా …ర‌క్త‌దాన విశిష్ట‌త‌ను ప్ర‌జ‌ల‌కు వివరించ‌డంద్వారా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావాలని ఆయన కోరారు. కరోనా వైర‌స్ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అంద‌ర‌మూ ముందుకొచ్చి ర‌క్తాన్ని దానం చేయాల‌ని కోరారు. స్వ‌చ్ఛంద ర‌క్త‌దానాన్ని ప్రోత్స‌హించాల్సిన అవసరం ఉందని కళ్యాణీ శ్రీనివాస్ అన్నారు. ప్యాట్స్ ఆధ్వర్యంలో అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి , ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, వికారాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రి ,తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి, కొత్తపేట్ ప్రమిత ఆసుపత్రి, బంజారాహిల్స్ రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రిలలోని వైద్యులు, వైద్య విద్యార్థులు   రక్తదానం చేసినట్లు కో ఆర్డినేటర్ కళ్యాణీ శ్రీనివాస్ తెలిపారు.

రక్తదానం చేసిన వారిలో నీలోఫర్ ఆషుపత్రి సూపరింటెండెంట్ మురళీ కృష్ణ, ఐఏపీ వైఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కుమార్ , పీడియాట్రిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ సురేంద్రనాథ్, సెక్రటరీ డాక్టర్ పవన్ కుమార్ , ఫ్యాట్స్ లీడ్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *