అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఒలింపిక్స్ రింగ్స్, సెల్ఫీ పాయింట్ ఆవిష్కరణ
హైదరాబాద్:
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు.. వారి వెనుక మేమున్నామంటూ మద్దతు తెలిపేందుకు ఏఎస్‌రావు నగర్‌లోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఒలింపిక్స్ రింగ్స్, సెల్ఫీ పాయింట్‌ను ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర క్రీడాశాఖలు ప్రారంభించిన చీర్ ఫర్ ఇండియా క్యాంపైయిన్‌లో భాగంగా వీటిని ఏర్పాటు చేసినట్టు అక్షర విద్యాసంస్థల సీఈఓ అరిశనపల్లి మదన్ మోహన్ రావు తెలిపారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు సత్తా చాటి పతకాల పంట పండించాలని.. దేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
తమ విద్యాసంస్థల్లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రతిభావంతులైన క్రీడాకారుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఈటీజెడ్ (ఎక్స్‌ట్రా టైమ్ జోన్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని స్కూల్ కరికలమ్‌లో భాగం చేశామని.. అలానే రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణిస్తున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో పాటు ప్రోత్సహకాలు అందిస్తున్నామని మదన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనుప్రియ వాహి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు