సెవెన్ ఫుడ్ కోర్టు లో సందడి చేసిన ఒలంపిక్ కాంస్య పథక విజేత పీవీ సింధు
సూర్యపేట్
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బ్యాడ్మింటన్ స్టార్ కాంస్య పతక విజేత అభి హిందూ కు మార్గమధ్యలో ఘన స్వాగతం లభించింది . సూర్యాపేట జిల్లా 7 ఫుడ్ కోర్ట్ లో అల్పాహారం తీసుకునేందుకు పి.వి.సింధు రావడంతో అభిమానులు హోటల్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది .ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తు సెవెన్ ఫుడ్ కోర్టు హోటల్ కు రావడంతో అభిమానులు ఆమెను అభినందనందించారు. యువత తమకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు తల్లిదండ్రుల కృషి అవసరమన్నారు. తాను తల్లిదండ్రుల ప్రోత్సాహం తోనే ఈ స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చారు.
7 ఫుడ్ కోర్ట్ ఇచ్చిన ఆతిథ్యం మర్చిపోయిలేనిదని పి.వి.సింధు అన్నారు.
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలలో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారిణి సింధుకు యావత్ భారత్ దేశం శుభాకాంక్షలు తెలిపింది.
మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో సింధు కాంస్య పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.