ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రధం ప్రారంభం
గుంటూరు
పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఎన్‌ఆర్‌ఐ ఉయ్యురు శ్రీనివాస్ ముందుకు రావడం అభినందనీయమని పలువురు కొనియాడారు. గుంటూరులో డాక్టర్ నిమ్మల శేషయ్య పర్యవేక్షణలో ఉచిత వైద్యం అందించడానికి ఎన్టీఆర్ ఆరోగ్య రధం పేరుతో నూతన వాహనాన్ని శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ వాహనంలో ఉచితంగా వైద్య సేవలు,మందులు ,200లకుపైగా వ్యాధి నిర్ధారణా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీంతో పాటు ఈ సీ జి, నెబులైజర్, ఆక్సీజన్ సిలిండర్, మాత శిశు సంరక్షణ, ఆరోగ్య నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి అన్నం అందించాలని అన్నా క్యాంటీన్స్ ప్రారంభించామని…పేద,బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం కోసం ఆరోగ్య రధం ప్రారంభించామన్నారు .
స్లమ్ ఏరియాలలో మెరుగెయిన వైద్యం కోసం సకల సౌకర్యాలు ఈ వాహనంలో కల్పించామన్నారు.
రోగికి పెద్ద వైద్యం ఏదయినా అవసరమైన డాక్టర్ నిమ్మల శేషయ్య హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందజేస్తామన్నారు .