హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ వద్ద పారా సైక్లిస్టులతో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎన్‌పిఎ డైరెక్టర్ అతుల్ కర్వాల్
అంగవైకల్యం కలిగిన వ్యక్తులను జీవనోపాధి కల్పించి, క్రీడల్లోనూ ప్రొత్సాహం కల్పిస్తున్న అదిత్య మెహతా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని నేషనల్ పోలీస్ అకాడమి డైరెక్టర్ అతుల్ కుమార్ అన్నారు .అధిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమి నుంచి బేగంపేట్ ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ వరకు నిర్వహించిన పారా సైక్లిస్టుల సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పారా సైక్లిస్టుల కోసం నిర్వహించిన సైకిల్ రైడ్‌లో నేషనల్ పోలీసు అకాడమీ, డైరెక్టర్ అతుల్ కర్వాల్ ,తెలంగాణ ప్రభుత్వం, పరిశ్రమలు, వాణిజ్యం ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ , ఎలికో లిమిటెడ్, విసి ,ఎమ్‌డి, వనిత దాట్ల ,ఎఎమ్‌ఎఫ్, వ్యవస్థాపకులు ఆదిత్య మెహతా పాల్గొన్నారు.
రసూల్‌పురాలోని ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో జాతీయ ,రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడల్లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లకు ప్రముఖులు కృత్రిమ అవయవాలు, స్పాన్సర్‌షిప్‌లు ,స్కాలర్‌షిప్‌లను అందజేసి సత్కరించారు. మౌంట్ భగీరథను అధిరోహించిన అర్యవర్థన్ కు ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్ అందుకున్నారు. పారా అథ్లెట్ ఆర్యవర్ధన్ మోకాలి పైభాగం వరకు అంగవైకల్యం ఉన్నపట్టుదలతో మౌంట్ భగీరథను అధిరోహించడం గొప్పవిషయమని వక్తలు కొనియాడరు .అనంతరం వాలీబాల్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ ,ఆర్చరీ వంటి క్రీడలలో పతకాలు సాధించిన జాతీయ అంతర్జాతీయ పారా అథ్లెట్లతో నిర్వహించిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో ప్రముఖులు పాల్గొన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనల ద్వారా భారత అథ్లెట్లు గొప్ప పతకాలను సాధించారని అదిత్య మెహతా ఫౌండేషన్ ఫౌండర్ అదిత్య మెహతా అన్నారు .టోక్యోలో రాబోయే పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెటిక్స్ అనుసరించడానికి ,రాణించడానికి ఇది ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. పారా ఒలంపిక్స్ 24, ఆగష్టు 2021 నుండి ప్రారంభమవుతుందని… 2024లో జరగబోయే పారాలింపిక్స్‌లోని మొత్తం 28 పారా క్రీడలలో పారా-అథ్లెట్లకు అర్హత సాధించాలన్నదే ఆదిత్య మెహతా ఫౌండేషన్ గట్టి ప్రయత్నమన్నారు. మన అథ్లెట్లు మరిన్ని జాతీయ ,అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో పాల్గొనడం ,పారాలింపిక్స్‌లో పాల్గొనడం ద్వారా తన కలను సాకారం చేసే దిశగా మేం ధృడనిశ్చయంతో పని చేస్తున్నామని ఆదిత్య మెహతా చెప్పారు.
అతుల్ కర్వాల్ 2008 మే లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి భారతదేశపు మొదటి ప్రభుత్వ అధికారి అని అదిత్య మెహత తెలిపారు.
అతుల్ కర్వాల్ గుజరాత్ క్యాడర్‌కు చెందిన అధికారి అని.. 2011లో ఎఎమ్‌ఎఫ్ ప్రారంభమైనప్పటి నుండి ఆయన మకు సంపూర్ణ మద్దతును అందిస్తున్నారని చెప్పారు. గుజరాత్‌లో ఎడిజిగా నియమించబడిన భారతదేశపు ఏకైక పారా-సైక్లిస్ట్ అయిన తనను చాలా ప్రోత్సాహించేవారని చెప్పుకొచ్చారు. తద్వారా 2013 లో జరిగిన ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో తాను పతకాలు సాధించామన్నారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అనేక సామాజిక, సాంస్కృతిక , ధార్మిక కార్యక్రమాలకు మద్దతు అందిస్తున్నారని చెప్పారు. ఆయన ఎల్లప్పుడూ ఎఎమ్‌ఎఫ్ కి పెద్ద మద్దతుగా ఉన్నారని గుర్తు చేశారు . ప్రముఖ నటి ,నిర్మాత, మానవతావాది అయిన మంచు లక్ష్మీ ఎఎమ్‌ఎఫ్‌కు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని పారా అథ్లెట్ల కోసం ఇటీవలనే నిధులను సేకరించారని అదిత్యా మెహతా ఈ సందర్భంగా గుర్తు చేశారు .