తెలంగాణలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 18నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ప్రకటించింది.

జనవరి 18 నుంచి గ్రూప్‌-2 దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో 503 గ్రూప్‌-1, 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తికాగా అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 23న ప్రారంభంకావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో డిసెంబర్‌ 30కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *