నేడు టిఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థుల నామినేషన్

మునుగోడు :

రసవత్తంగా మారిన మునుగోడు ఎన్నికలు ముఖ్య ఘట్టానికి చేరుకున్నాయి. నేడు టిఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు వేయనున్నారు. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి మాత్రం ఎప్పుడు నామినేషన్​ వేస్తారో ఇంకా అధిష్ఠానం నిర్ణయించలేదు.
మునుగోడు ఉపఎన్నికలో బరిలో నిలిచి టిఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇవాళ నామినేషన్‌ వేయనున్నారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికలపై ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టినందున నామినేషన్ల కార్యక్రమం మునుగోడులో సాదాసీదాగానే నిర్వహించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. సీపీఎం, సీపీఐ ముఖ్యనాయకులతో కలిసి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ను సమర్పించనున్నారు. నామినేషన్ల చివరి రోజైన ఈ నెల 14న మరో సెట్‌ నామినేషన్‌ వేయనున్నట్లు తెలిసింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉదయం 11 గంటలకు నామినేషన్ సమర్పించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *