తెలంగాణలో తమకు ప్రతిపక్షమే లేదు :సీఎం కేసీఆర్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేసిన ఆయన తెలంగాణలో తమకు ప్రతిపక్షమే లేదన్నారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో కొత్త రాజ్యాంగం అవసరముందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చాయని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారులపై కేంద్రం పెత్తనమేంటని కేసీఆర్ ప్రశ్నించారు.