తోడేళ్లు ఎన్ని ఏకమైనా విజయం మనదే :గృహసారథులు, కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
బాబు సంకనెక్కితే బలి పశువు పవనే
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది
గృహసారథులు, కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.
గుంటూరు : ఎవరి కోసమో పార్టీ పెట్టి, బాబు ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతో ఆయన సంకనక్కితే బలి పశువు అయ్యేది పవన్ కళ్యాణేనని ,అలాంటి వారిని నమ్మాలా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మంగళవారం మండల పరిధిలోని గణపవరం గ్రామంలో సచివాలయ కన్వీనర్లు, గృహసారధుల శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి మండల నాయకులు మర్రి సుబ్బారెడ్డి అధ్యక్ష వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ తోడేళ్లు ఎన్ని ఏకమైనా అంతిమ విజయం వైయస్సార్ సిపి దేనన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి జగనే కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలియంగా ఉందన్నారు. పారదర్శక సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. సత్తెనపల్లి నాది, నాది అని చాలామంది తిరుగుతున్నారని ఈ మధ్య కొత్తగా కూడా ఒకాయన వస్తున్నారని ఎంతమంది వచ్చినా మనకు భయం లేదన్నారు. అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, ప్రతి గ్రామంలోనూ కోట్ల రూపాయల విలువైన శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామన్నారు.వెల్ లెస్ కేంద్రాలు, రైతు భరోసాలు, సచివాలయాలు ఇవన్నీ అభివృద్ధి కాదా అని, ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ఉత్సవాలలో గృహ సారధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంయుక్తంగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు, సర్పంచ్ గనుపల్లి వెంకట రమణ, ఎంపీపీ తేలుకుట్ల రాజేశ్వరి, జడ్పిటిసి సభ్యులు దొంతి రెడ్డి సునీత రెడ్డి , రాజుపాలెం మండల సచివాలయాల కన్వీనర్ల ఇన్చార్జి పులిబండ్ల అశోక్, సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పెండెం బాబురావు, మండల కన్వీనర్లు భవనం రాఘవరెడ్డి, రాయపాటి పురుషోత్తమరావు, నక్క శ్రీనివాస రావు, జెసిఎస్ మండల ఇన్చార్జీలు రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, కొణతం స్వాతి, చిలకా జైపాల్, గనుపల్లి బుల్లిబాబు, తేలుకుట్ల చంద్రమౌళి స్థానిక నాయకులు ఉన్నారు.