క‌ల‌ర్ ఫుల్ గా సాగిన ఎస్‌బీఎం కన్వ‌కేషన్‌ సెర్మనీ

సంద‌డిగా మారిన NMIMS హైదరాబాద్‌ క్యాంపస్

హైదరాబాద్

నర్సీ మాంజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (NMIMS) హైదరాబాద్‌ క్యాంపస్ లో స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్ , ఎంబీఏ , పీజీడీఎం 11వ కన్వొకేషన్ సెర్మ‌నీ సంద‌డిగా సాగింది.హైద‌రాబాద్ జడ్చర్ల క్యాంపస్‌లో జ‌రిగిన ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా జీఎంఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (జీఎంఆర్‌ఓస్‌బీ) సీఈఓ అశ్వని లోహానీ ,గౌరవ అతిథిగా గూంజ్‌ , గ్రామ్‌ స్వాభిమాన్‌ వ్యవస్ధాపక డైరెక్టర్‌ అన్షు గుప్తాలు పాల్గొన్నారు. ఈ ఏడాది నుంచి క్యాంపస్‌లో రెసిడెన్షియల్‌ సదుపాయాలను ప్రారంభించారు. దీనితో పాటుగా సెంట్రలైజ్డ్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఫర్‌ రైల్వే ఎక్కౌంట్స్ మరియు రక్షణ ఆర్మర్డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రమేష్‌ భట్‌, విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు, అనంత‌రం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రమేష్‌ భట్‌ మాట్లాడుతూ ‘‘ ఎన్‌ఎంఐఎంఎస్ హైదరాబాద్‌ క్యాంపస్‌ , టీ హబ్‌తో బంధం కొనసాగిస్తుండటంతో పాటుగా విద్యార్ధులు, ఫ్యాకల్టీల నడుమ వ్యవస్థాపక ఆలోచనలను వృద్ధి చేస్తుందన్నారు. ఎన్‌ఎంఐఎంఎస్ వంద శాతం ప్లేస్‌మెంట్‌ రికార్డు కలిగిన సంస్ధగా నిలిచింద‌ని.. సరాసరి జీతం 25% వృద్ధి చెందింద‌న్నారు. క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల‌కు ఈ సంవత్సరం 50కు పైగా నూతన కంపెనీలు వ‌చ్చాయ‌న్నారు. హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రాముఖ్యత గణనీయంగా వృద్ధి చెందడంతో పాటుగా మహమ్మారి సమయంలో కూడా 100% ప్లేస్‌మెంట్‌ కొనసాగించింద‌న్నారు.

ప్రొ వైఎస్ ఛాన్స్ ల‌ర్ డాక్టర్‌ రమేష్‌ భట్ మాట్లాడుతూ ‘‘ మా క్యాంపస్‌ అకడమిక్‌ ఫెసిలిటీని మరింతగా బలోపేతం చేసేందుకు మేము మా శక్తిని రెట్టింపు చేసుకోవడంలో భాగంగా పీహెచ్‌డీలు కలిగిన ఫ్యాకల్టీ సభ్యులను రిక్రూట్‌ చేసుకుంటున్నాం’’అని అన్నారు. ఎన్‌ఎంఐఎంఎస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌, ఇప్పుడు పరిశోధనా సంస్కృతిని ట్యూజ్‌డె టాక్‌ సిరీస్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ద్వారా నిర్మించబోతుందన్నారు.

జీఎంఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ సీఈఓ అశ్వని లోహానీ మాట్లాడుతూ ‘‘నిష్కళంకమైన సమగ్రత, ప్రవర్తనను కొనసాగించాల‌ని .. విలువైన జీవితాన్ని గడపటానికి పునాది వేస్తుంది. సానుకూల థృక్పధం మీరు ఊహించలేనటువంటి విజయాలకు దారి తీస్తుంది. జీవితపు మూల మంత్రం స్వీకరించండి, నిష్కంళకమైన సమగ్రత మరియు ప్రవర్తనను నిర్వహించండి. ధైర్యాన్ని పెంపొందించుకోవాలి, సంకల్ప శక్తిని నమ్మండి. దీనితో పాటుగా మానవ వనరుల యొక్క అసాధారణ సామర్థ్యం పట్ల నమ్మకం చూపండి. అభిరుచితో కలలు కనండి, మీ ప్రయత్నాలను ఆత్మసాక్షిగా చేయండి. మీ కలలు నెమ్మదిగా వాస్తవరూపం దాల్చడానికి సాక్షులుగా నిలవండి’’ అని అన్నారు.

గూంజ్‌ మరియు గ్రామ్‌ స్వాభిమాన్‌ ఫౌండర్‌–డైరెక్టర్ అన్షు గుప్తా మాట్లాడుతూ ‘‘ మీరు భారతదేశపు భవిష్యత్‌ మేనేజర్లు. ఎన్‌ఎంఐఎంఎస్‌ వద్ద నేర్చుకున్న మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు మీ ప్రొఫెషనల్‌ కెరీర్‌లో కూడా తోడ్పడగలవు. నేడు ఈ ప్రపంచం డాటా ఎనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటివి భవిష్యత్‌గా నిలువనున్నాయి. ఎన్‌ఎంఐఎంఎస్‌ యొక్క డిజిటల్‌ విధానం ఖచ్చితంగా విద్యార్ధులకు అత్యుత్తమ అవకాశాలను అందించగలవు’’ అని అన్నారు.

ఎన్‌ఎంఐంఎస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తపన్‌ కె పాండా మాట్లాడుతూ క్యాంపస్‌లో నాణ్యత వృద్ధి చేయడం పట్ల ప్రయత్నాలను పునరుద్ఘాటించారు. నూతన విద్యా సంవత్సరంలో నూతన కరిక్యులమ్‌ ఆవిష్కరించడం ద్వారా విద్యార్థుల అభ్యాస అనుభవాలను సమృద్ధి చేస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థుల కోసం అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నామని, విద్యార్ధులు భవిష్యత్‌ కోసం సిద్ధంగా ఉండవచ్చని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *