హైదరాబాద్ ఖనాపూర్ లో వెల్ ఫిట్ సెంటర్ ను ప్రారంభించిన శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్

విదేశాలకే పరిమితమైన వెల్ ఫిట్‌ కాన్సెప్ట్ జిమ్ సెంటర్ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు.

హైదరాబాద్ ఖనాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్ ఫిట్‌ జిమ్‌ను ఆయన ప్రారంభించారు.మందులు లేకుండా వైద్యం అందించడంతో పాటు , ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఏర్పాటు చేసిన ఈ వెల్ ఫిట్ జిమ్
మరింత పురోభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

దేశంలో మొట్టమొదటిసారి గా వెల్ ఫిట్ కాంబినేషన్ తో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు మందులు లేకుండా వైద్యం అందిస్తామని వెల్ ఫిట్ జిమ్ ట్రైనర్ అజరయ్య తెలిపారు.

కినిషియో థెరపీ, ఇంటర్నల్ మెడిసిన్, ఆర్థోఫెడిక్ ,న్యూట్రిషన్, సైకాలజీ, క్లీనికల్ సోషల్ వర్క్ ,ఫిజికల్ థెరపీ, ఛైరోప్రాక్ట్ కేర్ ,కార్డియాలజీ, అక్యుపంచర్ ,మసాజ్ థెరపీ, జనరల్ ఫిట్ నెస్ ,అథ్లెటిక్ ప్రొఫార్మెన్స్ విధానం ద్వారా చికిత్స అందిస్తామన్నారు.

విదేశాల్లో వెల్ ఫిట్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సెంటర్ లలో ఎంతో మంది వివి బాధల నుంచి ఉపశమనం పొందారని అజరయ్య తెలిపారు. ఈ సరికొత్త వైద్య విధానాన్ని హైదరాబాదీయులకు అందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *