సికింద్రాబాద్ లో నీల్ డేవిడ్స్ అకాడమీ ని ప్రారంభించిన నీల్ డేవిడ్స్
సికింద్రాబాద్
బ్యూటీ రంగంలో విశేష అనుభవం పొందిన నీల్ డేవిడ్స్ సంస్థ తెలంగాణలో సేవలను ప్రారంభించింది. సికింద్రాబాద్ ఖర్ఖానాలోని పి అండ్ టి కాలనీ లో నీల్ డేవిడ్స్ సెలూన్ అండ్ అకాడమీ ని నీల్ డేవిడ్ వర్ధమాన సినీనటులు శ్రీలేఖ, ఇషా, సింధు, చందనలు ప్రారంభించారు.
ఈ సందర్బంగా నిర్వహకులు దీప్శిఖా మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మొట్టమొదటి నీల్ డేవిడ్స్ సెలూన్ ను ప్రారంభించుకోవడం సంతోషం గా ఉందన్నారు.
నీల్ డేవిడ్స్ సెలూన్ ప్రత్యేక మైన గ్రూమింగ్ సేవలని సెలెబ్రిటిలకు అందిస్తోంది. హైదరాబాద్ ప్రజలకు బ్యూటీ సేవలు అందించేందుకు ముందుకు వచ్చామని నీల్ డేవిడ్స్ అన్నారు. చిక్ ,ట్రెండ్ హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్ సేవలని అందిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు అకాడమీ ద్వారా బ్యూటీ కోర్స్ లను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బ్యూటీ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.