బ్యూటీ పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంది న్యాచురల్ మేకప్అండ్ స్కిన్ కేర్ సెలూన్ హెడ్ అరవింద్ కుమార్

హైదరాబాద్ ,కొంపల్లి

దేశంలో బ్యూటీ పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉందని న్యాచురల్ బ్యూటీ సెలూన్ హెడ్ అరవింద్ కుమార్ అన్నారు .హైదరాబాద్ కొంపల్లిలోని న్యాచురల్ మేకప్‌ అండ్ స్కిన్ కేర్ సెంటర్‌ మూడవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కోవిడ్ తర్వాత అన్ని రంగాల్లో మళ్ళీ బిజినెస్ లు ఉపందుకుంటున్నాయి . సర్వీస్ ఇండస్ట్రీ అయినటువంటి బ్యూటీ సెలూన్స్ కొత్త సర్వీస్ లతో ముందుకు వస్తోంది . హైదరాబాద్ కొంపల్లిలోని నాచురల్స్ మేకప్ అండ్ స్కిన్ కేర్ సెలూన్ లో మూడవ వార్షికోత్సవ వేడుకలు కలర్ ఫుల్ గా సాగాయి. ఈ సందర్భంగా లేటెస్ట్ బ్రైడల్ మేకప్స్ , హెయిర్ స్టైల్స్ ను సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. రానున్న పెళ్లిళ్ల సీజన్ కోసం తెలుగు,ముస్లిం, నార్త్ ఇండియన్ బ్రైడల్ లుక్స్ లో మోడల్స్ మెరిసారు. సాంప్రదాయ డ్రెస్ ల్లో చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. కోవిడ్ ప్యాండెమిక్ తర్వాత అన్ని రకాల కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ స్కిన్ అండ్ హెయిర్ సర్వీస్ లు అందిస్తున్నట్టు న్యాచురల్ బ్యూటీ సెలూన్ హెడ్ అరవింద్ కుమార్ తెలిపారు. డిఫెరెంట్ హెయిర్ స్టైల్స్, మేకప్స్ తో ప్రదర్శిస్తూ మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *