కోవిడ్ మూడో దశ సన్నద్ధతపై మంత్రి పేర్ని నాని సమీక్ష

జిల్లాలో కొవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వైద్యాధికారులను ఆదేశించారు.

నగర పాలక సంస్థ కమీషనర్ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో కొవిడ్ మూడో దశ సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున ఆసుపత్రుల్లో సాధారణ ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సరైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది రోగులకు ఉత్తమ సేవలు అందిస్తున్నారనే పేరు సంపాదించారని ఆ కీర్తి అదేవిధంగా నిలుపుకోవాలన్నారు. అవినీతికి పాల్పడుతూ, పేదలైన రోగుల వద్ద డబ్బులు పిండే ఉద్యోగుల భరతం పట్టాలన్నారు. ప్రభుత్వాసుపత్రి ప్రతిష్టకు భంగం కల్గించే ఏ వ్యక్తి నైనా ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించరాదని పేర్కొన్నారు. ఇప్పటికీ కొందరు మచిలీపట్నం ఆసుపత్రిగా పరిగణిస్తున్నారని, ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న జిల్లా ప్రభుత్వాసుపత్రి ఏ కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోదని అన్నారు. నర్సింగ్ క్లినిక్ నిర్వహించి స్థానికంగా ఉండే రిటైర్డ్ వైద్యుడిని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్టు పద్దతిలో అనుభవజ్ఞుడైన ఒక సీనియర్ వైద్యుడిని నియమించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని డాక్టర్ అల్లాడ శ్రీనివాస్ కు మంత్రి సూచించారు.జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పరిసరాలలో శుభ్రత వెల్లివిరియాలని, ఆసుపత్రి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే రోగులు త్వరితిగతిన కోలుకొని ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అవుతారని మంత్రి వ్వ్యాఖ్యానించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కావాల్సిన వైద్య సామాగ్రి, వసతులు విషయంలో ఏమి కావాలో తనను అడగాలని ఏ స్థాయిలో వాటిని రప్పించాలో తానూ కృషి చేస్తానని మంత్రి పేర్ని నాని వైద్యులకు భరోసా ఇచ్చారు.


ఈ సమీక్షా సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. శివరామకృష్ణ, జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ జయకుమార్, ఆర్ ఎం ఓ డాక్టర్ మల్లిఖార్జున రావు, డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నగరపాలక సంస్థ ఇంజినీరింగ్అధికారులతో మంత్రి సమీక్ష

రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మున్సిపల్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో నగర పాలక సంస్థ కమీషనర్ కార్యాలయంలో శనివారం ఉదయం సమావేశం నిర్వహించారు. నగరంలో చేపట్టిన వివిధ అభివద్ధి పనులు, వాటి ప్రగతిపై సమీక్షించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పెండింగ్ పనుల గురించి మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. వీధి దీపాలను ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గత ఫిబ్రవరి , మార్చి నెలలో 500 లైట్లు ఏర్పాటుచేశారని, ప్రస్తుతం ఎన్ని లైట్లు రిజర్వు గా ఉన్నాయని ఎలక్ట్రికల్ డి ఇ సాయి ప్రసాద్ ను మంత్రి ప్రశ్నించారు. తన వద్ద 125 వీధిదీపాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన జవాబు చెప్పారు. అమత్ స్కీం క్రింద ఇంకా చేయాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివద్ధికి తీసుకుంటున్న చర్యలు గురించి అధికారులతో మాట్లాడారు. మాచవరం మసీద్ మరమత్తులు నిర్మాణ పనులు గురించి వాకబు చేశారు. అదే విధంగా అయిదు రోడ్ల కూడలిలోడ్రైన్ ఏర్పాటు, కొర్రె0గూడెం నుంచి ప్రభుత్వ వృద్ధాశ్రమం వరకు రోడ్డు బాగా పాడైందని వచ్చే బడ్జెట్ లో ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మంత్రి తెలిపారు. 44 వ సచివాలయం పరిధిలో తాగునీరు సరిగా అందడం లేదని పిర్యాదులు వస్తున్నాయని వాస్తవ పరిస్థితిపై మంత్రి సంబంధిత అధికారితో సంభాషించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ నగరపాలక కమీషనర్ సబ్బి శివరామకష్ణ, ఎంఇ త్రినాద్ బాబు , టౌన్ ప్లానింగ్ అధికారి నాగశాస్త్రులు , పిల్లి ప్రసాద్, వార ప్రసాద్ ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ ఐ కళ్యాణ్, విద్యుత్ శాఖ ఇఇ సాంబశివరావు, తదితరులు. పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *