అడవిని దత్తత తీసుకున్న నాగార్జున అక్కినేని
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం
నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన
మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అడవిని దత్తత స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్
తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తన భార్య అక్కినేని అమల, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి వెళ్లి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో నాగార్జున అడవిని దత్తత తీసుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నాగార్జున అడవిని దత్తత తీసుకున్నారు. నాగార్జున కుమారుడు నాగ చైతన్య, అఖిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.