హైద‌రాబాద్‌లో ఇండియన్ ఐడిల్ గాయ‌కుల‌తో మ్యూజికల్ నైట్

హైదరాబాద్ 29 ఆగష్టు 2021:

సంగీత అభిమానులను అలరించేందుకు ఇండియన్ ఐడిల్ టీం హైదరాబాద్‌లో ప్రదర్శనలు నిర్వహించనుంది.

ఎలెవన్ పాయింట్ టు , మెటలాయిడ్ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా హైదరాబాద్ లో సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబర్ 30 వరకు మ్యూజికల్‌ నైట్‌లు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఐడిల్ టీం తెలిపింది.

ఇండియ‌న్ ఐడిల్‌లో విజేత‌గా నిలిచిన పవన్ దీప్ రాజన్ , ష‌ణ్ముక ప్రియ‌తోపాటు మ‌రో ఇద్ద‌రు గాయకుల‌తో హైద‌రాబాద్‌లో తొలిసారిగా ప్ర‌త్య‌క్ష సంగీత కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నట్లు మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్ర‌తినిధి ప్రీతిష్ కోలాటి తెలిపారు.

కొవిడ్ కారణంగా దాదాపు 18నెల‌ల సుదీర్ఘ విరామం త‌రువాత ప్ర‌త్య‌క్ష సంగీత క‌చేరిల‌కు ఇదే తొలి వేదిక కానుంది. రివైవ్ కన్స‌ర్ట్ సిరీస్ పేరుతో ఇప్పుడు అభిమానుల ముందుకు వ‌స్తున్నట్లు ఇండయన్ ఐడిల్ విజేత పవన్ దీప్ రాజన్ వెల్లడించారు. ఈ సెప్టెంబ‌రు నుంచి బ్యాండ్‌, సింగ‌ర్‌, మ్యుజీషియ‌న్‌లతో క‌లిసి సెప్టంబ‌ర్ ప్ర‌తి వారం ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్దమ‌వుతున్నామన్నారు.

ప్ర‌తిభావంతులైన క‌ళాకారుల‌ను మీముందుకు తీసుక‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నట్లు మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్ర‌తినిధి ప్రీతిష్ కోలాటి చెప్పారు. ఇందులో భాగంగానే కేర‌ళ‌కు చెందిన తైక్కుడం బ్రిడ్జ్‌, మ‌సాలా కాఫీ, ఇండియ‌న్ ఐడిల్ షోలో ఫైన‌లిస్టుల‌ను ఈ వేదిక‌పైకి తీసుకొస్తున్నామన్నారు. తైక్కుడం బ్రిడ్జ్ క‌ళాకారుల ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 2న, ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత ప‌వ‌న్‌దీప్ రాజన్‌తో సెప్టెంబ‌రు 3న హార్ట్‌క‌ప్‌లో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సిరీస్‌లో దేశంలోని అత్యుత్త‌మ‌మైన సంగీత‌కారుల‌తోపాటు గాయ‌కులు పాల్గొంటాని ఆమె వివరించారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండియన్ ఐడల్ విజేత పవణ్‌దీప్ రాజన్, మొదటి రన్నరప్ అరుణిత కంజిలాల్, రెండవ రన్నరప్ సైలి, మూడవ రన్నరప్ మొహమ్మద్ డానిష్ , రాక్‌స్టార్ షణ్ముఖ ప్రియలు మ్యూజికల్ నైట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించే రివైవ్ కచేరీ సిరీస్ ప్రదర్శన కు సంబంధించిన వివ‌రాలు

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజంలో సెప్టెంబర్ 2 న తైకుద్దం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ,గచ్చిబౌలి హార్ట్ కప్ కాఫీ సెంటర్ లో సెప్టెంబర్ 3 వ తేదీన ఇండియన్ ఐడల్ పవన్ దీప్ రాజన్ ,గచ్చిబౌలి ప్రిజంలో సెప్టెంబర్ 23 వ తేదీన మసాలా కాఫీ మ్యూజిక్ బ్యాండ్ ,జూబ్లీహిల్స్ గ్రీక్ మంకీ క్లబ్ లో అక్టోబర్ 1 వ తేదీ న ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ లు ప్రదర్శన ఉంటుంది.ఇక అక్టోబర్ 2 వ తేదీన చిన్మయి , కాప్రిసియో లలో ,అక్టోబర్ 9 వ తేదీన స్టాక్కాటో కాంటెంపోరే క్లాసిక్ బ్యాండ్ .
అక్టోబర్ 15 న రవీంద్ర భారతిలో శోభన ప్రదర్శన,
అక్టోబర్ 23 వతేదీన గచ్చిబౌలి హార్ట్ కప్ కాఫీలో ఇండియన్ ఐడల్ టాప్ 5 టీం , అక్టోబర్ 30 వ తేదీన అవియల్ లో సంగీత ప్రదర్శన ఉంటుందని నిర్వహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *