ములాయం సింగ్ యాదవ్ మృతి దేశానికి తీరని లోటు-బోయినపల్లి వినోద్ కుమార్
బలహీన, బడుగు వర్గాలు గొప్ప నాయకున్ని కోల్పోయాయి
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యక్తం చేశారు.
ములాయం సింగ్ యాదవ్ మృతి దేశానికి తీరని లోటు అని, దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ములాయం సింగ్ యాదవ్ మృతి చెందడంతో దేశం ఒక గొప్ప బలహీన బడుగు వర్గాల నాయకున్ని కోల్పోయిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.