మోడలింగ్ రంగంలో రాణించాలనే యువతకు మిస్టర్ అండ్ మిస్ సౌత్ ఇండియా 2021 మంచి వేదిక:బిగ్ బాస్ ఫేం హారిక

హైదరాబాద్,బేగంపేట

ఫ్యాషన్ మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే యువతీ యువకులకు వింగ్స్ మోడల్స్ హబ్ మంచి ఫ్లాట్ ఫామ్ గా నిలిచిందని బిగ్ బాస్ ఫేం హారిక అన్నారు.

హైదరాబాద్ బేగంపేట్ కంట్రీ క్లబ్ లో వింగ్స్ మోడల్స్ హబ్ ఆధ్వర్యంలో మిస్టర్ అండ్ మిస్ సౌత్ ఇండియా 2021 ఫైనల్ పోటీలు జరిగాయి.

ఈ పోటీల్లో టైటిల్ దక్కించుకునేందుకు యువత పోటీ పడ్డారు. వింగ్స్ మోడల్ హబ్ నిర్వహిస్తున్న మోడలింగ్ హంట్ కు మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ ఫేం హారిక మాట్లాడుతూ ఫ్యాషన్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులకు వింగ్స్ మోడల్ హబ్ మంచి వేదిక అని తెలిపారు.

మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా 2021 పోటీలకు యువతీ యువకుల నుంచి విశేష స్పందన లభించిందని సంస్థ డైరెక్టర్ మనోజ్ వీరగోని తెలిపారు.

ఇప్పటివరకు వంద మంది పైగా యువతకు మోడలింగ్ ఫ్యాషన్ రంగంలో మంచి అవకాశాలు లభించాయని ఆయన తెలిపారు. తమ సంస్థ అసోసియేట్ అయినటువంటి ప్రముఖ సంస్థలలో విజేతలను యాడ్స్ లలో ప్రచారకర్తలుగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. టాలెంట్ ఉన్న యువతీ యువకులను సినీ రంగంలో సైతం అవకాశాలు కల్పించేందుకు తన వంతు ప్రయత్నిస్తామని నిర్వహకులు తెలిపారు. మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా 2021 లోని వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. మోడ్రన్ ,ట్రెడిషనల్ వేర్ ధరించి చేసిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది . బిగ్ బాస్ ఫేమ్ హారిక సైతం ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ అందరినీ అలరించారు.

వింగ్స్ మోడలింగ్ హబ్ ఈవెంట్ లో ఆశ్మి సినిమా టీం సభ్యులు సందడి చేశారు. చిన్న సినిమా అయినటువంటి అశ్మి ఆదరించిన ప్రేక్షకులకు నటీనటులు కృతజ్ఞతలు తెలిపారు. లేడి ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని ..ఈ సినిమాను ప్రతి ఒక్కరు ఆదరించాలని టీం సభ్యులు కోరారు. ఆశ్మి సినిమా త్వరలో ఓటీపీ ఫ్లాట్ఫామ్ ద్వారా అందుబాటులోకి వస్తుందని సినీ డైరెక్టర్ sesh karthikeya ,Producer sneha rakesh ,hero raja narendra,artist keshav deepak లు తెలిపారు.

మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా 2021 పోటీలలో మిస్టర్ సౌత్ ఇండియా టైటిల్ ను తరుణ్ దక్కించుకున్నారు. మొదటి రన్నరప్ గా మారుతీ చరణ్ రేణికుంట ,రెండవ రన్నరప్ గా వినయ్ సిద్దార్థ్ లను జ్యూరీ ఎంపిక చేసింది .

మిసస్ సౌత్ ఇండియా టైటిల్ ను పూజ దర్షిక దక్కించుకోగా.. మొదటి రన్నరప్ గా వైష్ణవి, రెండవ రన్నరప్ గా మాధవిని జ్యూరీ ఎంపిక చేసింది.

ఈ షోకు న్యాయ నిర్ణేతలుగాలుగా బిగ్ బాస్ ఫేం హారిక ,Mrs India Queen of substance Jhanvi Bajaj,Mrs Femina India Kritika Shrama,Mrs India Sudha Jain, Supermodel India Anju Sree,Designer sushma,Bollywood Hero Harsh,Tollywood Heroine Juhi ,International fashion designer BJP member Alka Manoj,Actor Jayakanth Bobby లు వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *