పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంపి విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ :
రహదారులు, నౌకాయానం, పౌరవిమాన యానం, పర్యాటక, సాంస్కృతిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి వ విజయసాయి రెడ్డి గురువారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ ఆయా రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి సరైన పరిష్కార మార్గాలను కేంద్రప్రభుత్వానికి సూచించి అవి అమలయ్యే విధంగా శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలిపారు. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు పొంది పదవీ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో కామర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ గా విజయసాయి రెడ్డి విశేష సేలందించారు. వాణిజ్య రంగానికి సంబంధించి పలు జాతీయ అంతర్జాతీయ అంశాలను పరిశోధించి కేంద్ర ప్రభుత్వానికి విలువైన సూచనలు అందించి పార్లమెంటరీ కమిటీల స్థాయికి మరింత వన్నె తెచ్చారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఎంతగానో ప్రోత్సహించి ఈ పదవి వరించడానికి కారణమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.