ఏపీలో ముందస్తు ఎన్నికలు పక్క అంటున్న ఎంపీ రఘురామకృష్ణరాజు..!
ఏపీ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పుల కోసం ఎదురుచూస్తోందని, ఏపీలో ప్రభుత్వ పథకాలకు సరిపడా నిధులు లేవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మినహా వైసీపీ ప్రభుత్వానికి వేరే ఆప్షన్ కనిపించడంలేదని రఘురామ వివరించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
