F1 రేసింగ్ క్రీడల్లో ఇండియా నుంచి మేల్ విభాగంలో ఒకరు ,ఫిమేల్ విభాగంలో ఒకరిని ఎంపిక చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం:రేసింగ్ ప్రమోషన్స్ ఛైర్మన్ అఖిలేష్ రెడ్డి
హైదరాబాద్,మాదాపూర్
ఫార్మిలా వన్ రేసింగ్‌లో ఇండియా నుంచి ఒక్కరైనా పాల్గొనేలా రైడర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఇండియన్ రేసింగ్ లీగ్‌లను నిర్వహిస్తున్నట్లు రేసింగ్ ప్రమోషన్స్ ఛైర్మన్ అఖిలేష్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ ఐటసీ కోహినూర్ వద్ద ‘ఫార్ములా రీజినల్ ఇండియన్ ఛాంపియన్షిప్ , ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్’ పోటీలను మేలి సంస్థ ఛైర్మన్ పి.పి రెడ్డి, ఎండీ కృష్ణా రెడ్డి లు ప్రారంభించారు.
ప్రపంచ స్థాయి FIA గ్రేడ్ గల ఈ స్ట్రీట్ సర్క్యూట్ హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరులో ఫిబ్రవరి 2022 లో నాలుగు నగరాల్లో జరగతుందని అఖిలేష్ రెడ్డి తెలిపారు.
కర్టెన్ రైజర్‌లో భాగంగా హైదరాబాద్ ఎఫ్ 3 స్ట్రీట్ సర్క్యూట్ నిర్వహించారు. మాదాపూర్ కోహినూర్ హోటల్ వద్ద సభా వేదిక నుండి ప్రారంభమైన రెండు ఎఫ్ 3 కార్లు కేబుల్ బ్రిడ్జి మీదుగా రుయ్యి..రుయ్యి మంటూ దూసుకెళ్ళాయి.ఈ రేసింగ్ తిరిగి వేదిక వద్ద ముగిసింది.
F3 రెస్ కారు, రేసింగ్ ప్రమోషన్స్ ఛైర్మన్ అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ, “మొనాకో ఒక సైవరిన్ (SOVEREIGN) సిటీ స్టేట్ F1 డ్రైవర్లను తయారు చేసిందన్నారు. బిలియన్ ప్లస్ ఉన్న మన దేశంలో ఇప్పుడు ఔత్సాహిక రేసింగ్ డ్రైవర్లకు అవకాశం కల్పించడానికి వేదికను కలిగిస్తున్నామన్నారు.
“మోటార్స్పోర్ట్ల లాంగ్ టర్మ డెవలెప్ మెంట్ కోసం పెట్టుబడి పెట్టడానికి , భారతదేశంలో ఔత్సాహిక రేసింగ్ డ్రైవర్ల కోసం ఒక ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడానికి కృతనిశ్చయంతో ఉన్నామని వివరించారు.
రేసింగ్ మొదటి సీజన్ ఫిబ్రవరి-మార్చి 22 న న్యూఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరులో , హైదరాబాద్ జరుగుతుందని మరియు గ్లోబల్ రేసింగ్ టాలెంట్లను ఈ ఆకర్షిస్తుందని తెలిపారు.
RPPL వైస్ ఛైర్మన్ నవజీత్ మాట్లాడుతూ మా పెట్టుబడి భారతీయ మోటార్‌స్పోర్ట్‌లలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు. RPPL రాబోయే నెలల్లో, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ FIA ద్వారా ధృవీకరించబడిన ఫార్ములా రీజినల్ ఇండియన్ ఛాంపియన్షిప్ మరియు ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్లను నిర్వహిస్తుందన్నారు. Q1 2022 లో నగర ఆధారిత లీగ్‌ను “ఇండియన్ రేసింగ్ లీగ్” రీలీంచ్ చేయాడానికి సిద్దంగా ఉన్నామన్నారు.
వచ్చే ఏడాది లోపు ఇండియా నుంచి ఒక మేల్ , ఒక ఫిమేల్ రైడర్లు ఫార్మిలా వన్ రేసింగ్‌లో పాల్గొనేలా రేసింగ్ పోటీల్లో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు . రేసింగ్ క్రీడను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఒక చక్కటి వేదికగా నిలుస్తుందని అఖిలేష్ రెడ్డి తెలిపారు.